itel A49:త్వరలో ఇండియాలో లాంచ్.. రూ. 7వేల లోపు గొప్ప ఫీచర్లతో అందుబాటులో..

ఐటెల్ గత నెలలో ఐటెల్  ఏ27ను భారతదేశంలో ప్రారంభించింది. ఐటెల్  ఏ27 5.45 అంగుళాల ఐ‌పి‌ఎస్ డిస్‌ప్లే అందించారు. ఇప్పుడు కంపెనీ మరో కొత్త ఫోన్ లాంచ్ కి సిద్ధమవుతోంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ పేరు ఐటెల్ ఏ49.

itel A49 will be launched in India soon, great features will be available in less than Rs 7,000

ఐటెల్  కొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ఐటెల్  ఏ27 (A27)ను గత నెలలో భారతదేశంలో విడుదల చేసింది. ఐటెల్  ఏ27 5.45 అంగుళాల ఐ‌పి‌ఎస్ డిస్‌ప్లేతో  వస్తుంది. అంతేకాకుండా డ్యూయల్ 4జి VoLTE సపోర్ట్ ఇందులో ఇచ్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11గో ఎడిషన్‌తో పరిచయం చేశారు. ఇప్పుడు కంపెనీ మరో కొత్త ఫోన్ లాంచ్ కి సిద్ధమవుతోంది. కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్ ఐటెల్ A49 త్వరలో భారతీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఐటెల్ కొత్త ఫోన్‌కి సంబంధించిన టీజర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఐటెల్ ఏ49 వాటర్‌డ్రాప్ నాచ్‌తో పెద్ద డిస్‌ప్లేను పొందుతుంది, అయితే డిస్‌ప్లే సైజ్ గురించి సమాచారం లేదు.

ఐటెల్ ఏ49లో సింగిల్ బ్యాక్ కెమెరా,  ముందు కెమెరా ఉంటుంది. ముందు ఇంకా వెనుక ప్యానెల్‌లలో 5 మెగాపిక్సెల్ కెమెరాలు ఉంటాయి. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ రెండూ ఫోన్‌తో అందుబాటులో ఉంటాయి. ఐటెల్  ఏ49 ఆండ్రాయిడ్ 11గో ఎడిషన్‌తో పరిచయం చేయనుంది. లీకైన నివేదిక ప్రకారం, ఐటెల్ ఏ49 2జి‌బి ర్యామ్ తో 32జి‌బి స్టోరేజ్  పొందుతుంది. ఫోన్‌తో పాటు వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.

గత నెలలో లాంచ్  అయిన ఐటెల్ ఏ27  ఫీచర్లు కూడా ఈ ఫోన్‌ని పోలి ఉన్నాయని సమాచారం. ఐటెల్ ఏ27 ధర రూ. 5,999. ఫోన్ ఒకే వేరియంట్‌లో అంటే 2జి‌బి ర్యామ్, 32జి‌బి స్టోరేజ్‌తో పరిచయం చేసారు. ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఐటెల్ ఏ27లో ఇచ్చారు. దీనికి 5.45-అంగుళాల FW+ IPS డిస్‌ప్లే, 1.4GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఉంది, దీని మోడల్ గురించి కంపెనీ సమాచారం ఇవ్వలేదు.

ఐటెల్ ఏ27 2జి‌బి ర్యామ్ తో 32జి‌బి స్టోరేజ్ పొందుతుంది, దీనిని మెమరీ కార్డ్ సహాయంతో 128జి‌బి వరకు పెంచుకొవచ్చు. కెమెరా గురించి మాట్లాడితే ఐటెల్ ఏ27 5-మెగాపిక్సెల్ AI బ్యాక్ కెమెరా ఉంది ఇంకా ముందు భాగంలో సెల్ఫీ కోసం 2-మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ రెండూ ఉన్నాయి. 4000mAh బ్యాటరీ ఐటెల్ ఏ27లో ఇచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios