మీరు ఈ ఫోన్‌ని చూసినట్లయితే, దీని ధర రూ. 14,999 ఇంకా రెండు స్టైలిష్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది – సిల్క్ గోల్డ్ అండ్  స్టార్రీ బ్లాక్. మీరు దీన్ని డిసెంబర్ 25 నుండి Flipkart, Amazon.in ఇంకా  Oppo.in నుండి ఆన్‌లైన్‌లో పొందవచ్చు. 

 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో భారతదేశంలో కొత్త ఫోన్ Oppo A59 5Gని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఒప్పో A-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒక భాగం అలాగే కొన్ని అద్భుతమైన ఫీచర్‌లతో వస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ అందించారు, దింతో మీకు రోజంతా బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. అంతేకాదు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. MediaTek ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. మరోవిషయం ఏంటంటే వాటర్-రిసిస్టెంట్ డిజైన్‌ ఉంది. 

ధర అండ్ కలర్స్ 
మీరు ఈ ఫోన్‌ని చూసినట్లయితే, దీని ధర రూ. 14,999 ఇంకా రెండు స్టైలిష్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది – సిల్క్ గోల్డ్ అండ్ స్టార్రీ బ్లాక్. మీరు దీన్ని డిసెంబర్ 25 నుండి Flipkart, Amazon.in ఇంకా Oppo.in నుండి ఆన్‌లైన్‌లో పొందవచ్చు.

ప్రత్యేకమైన లాంచ్ ఆఫర్లు
మొదటి కొనుగోలుదారులకు Oppo కొన్ని మంచి లాంచ్ డీల్‌లను అందిస్తోంది:

రూ. 1,500 వరకు క్యాష్‌బ్యాక్ పొందండి ఇంకా సెలెక్ట్ చేసిన బ్యాంక్ కార్డ్‌లతో 6 నెలల వరకు నో-కాస్ట్ EMIని పొందవచ్చు. వివిధ ఫైనాన్షియర్స్ ద్వారా కేవలం రూ. 1,699 నుండి ఆకర్షణీయమైన EMI అప్షన్స్ లభిస్తాయి.

My Oppo Exclusive Oppo A59 5G కొనుగోలుపై ఖచ్చితమైన గిఫ్ట్స్ గెలుచుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది.

హై లెట్ ఫీచర్స్ 
స్మోత్ విజువల్స్ కోసం హై రిఫ్రెష్-రేట్ డిస్‌ప్లేతో స్లిమ్ డిజైన్.
క్విక్ టాప్-అప్‌ల కోసం 33W VOOC ఛార్జింగ్‌తో కూడిన భారీ 5000 mAh బ్యాటరీ.
6GB RAM అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో SD కార్డ్‌తో మరింత పెంచుకోవచ్చు.
అద్భుతమైన ఫోటోల కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ (13MP + 2MP) అండ్ 8MP సెల్ఫీ షూటర్.

స్మార్ట్ సేవింగ్స్ ఆఫర్
న్యూ ఇయర్ బొనాంజాలో భాగంగా, Oppo క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ EMI, జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్‌లతో సహా సెలెక్టెడ్ A సిరీస్ ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఇంకా ఆఫర్‌లను అందిస్తోంది.