ఆపిల్ ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధరలు ఇండియాలో పెరగనున్నాయా.. ? వీటి ధరలు ఎంతంటే..
ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మోడళ్ల ధరలను విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఖచ్చితమైన ధర వివరాలు వెల్లడి కానప్పటికీ, ప్రో మోడల్స్ సుమారు $200 ధర పెరుగుదలను అనుభవించవచ్చని నివేదికలు సూచించాయి, అంటే భారతదేశంలో దాదాపు రూ. 16,490 పెరగవచ్చు.
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ నుండి రాబోయే ఐఫోన్ 15 ప్రో మోడల్‌ల ధర సుమారు $200 అంటే దాదాపు రూ.16,000 వరకు పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఐఫోన్ 15, ఐఫోన్ 15 Pro, ఐఫోన్ 15 Pro Max ఇంకా ఐఫోన్ 15 Plus నెక్స్ట్ ఐఫోన్ 15 సిరీస్‌లో భాగం కావచ్చు. మీడియా నివేదికల ప్రకారం, ఐఫోన్ 15 Pro మోడల్స్ ధర $200 సుమారు రూ. 16,490 వరకు పెరగవచ్చు. ఇదే నిజమైతే భారతదేశంలో ఐఫోన్ 15 Pro ధర 16,490 రూపాయల పెంపును చూడవచ్చు.
ముఖ్యంగా, ఇతర అంతర్జాతీయ మార్కెట్ల కాకుండా యుఎస్ మార్కెట్ ఐఫోన్ 14 ప్రో ధరలలో పెరుగుదలను చూడలేదు. నివేదికల ప్రకారం 2023లో ఇండియన్ మార్కెట్లు తాజా పెరుగుదల తర్వాత రెండవ సారి పెరుగుదలను అనుభవిస్తాయి.
ధరల పెరుగుదలకు గల కారణాలను నివేదికలు వెల్లడించలేదు. అయినప్పటికీ, హార్డ్‌వేర్‌లో పురోగతి కారణంగా ఇది జరిగిందని ఊహిస్తారు.
ఆపిల్ ఐఫోన్ 14 Pro ప్రారంభ ధర భారతదేశంలో రూ. 1,29,900, USలో దీనిని $999 అంటే సుమారు రూ. 82,380 వద్ద ప్రారంభించారు. ధరను 200 డాలర్లు పెంచినట్లయితే, USలో దీని ధర $1,199 అంటే దాదాపు రూ. 98,850 ఉంటుంది.
మరోవైపు జిఎస్‌టి, కస్టమ్స్ డ్యూటీ ఇంకా మరిన్ని వంటి అదనపు ఛార్జీల కారణంగా భారతదేశంలో దీని ధర మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఐఫోన్ 15 ప్రో భారతదేశంలో రూ. 1,44,900 కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా.
ఐఫోన్ 14 సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ఆపిల్ డేస్ ఈవెంట్ సందర్భంగా భారతదేశంలో అమ్మకానికి ఉంది. దీని అసలు ధర రూ.79,900, ఐఫోన్ 14 ఇప్పుడు అమెజాన్‌లో రూ.67,999కి అందుబాటులో ఉంది. మరోవైపు ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర రూ.89,900 నుంచి రూ.76,900కి పడిపోయింది. అమెజాన్ యాపిల్ డేస్ సేల్ జూన్ 17తో ముగియనుంది.
Apple సాధారణంగా సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్‌లను ఆవిష్కరించినందున iPhone 15 సిరీస్ లాంచ్ ని సుమారు మరో రెండు మూడు నెలల్లో అంచనా వేయవచ్చు. అయితే లాంచ్ ఈవెంట్ సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.