Asianet News TeluguAsianet News Telugu

ఐకూ నియో 7 vs పోకో X5 ప్రొ 5G:ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఏది బెస్ట్, ధర నుండి కెమెరా ఫీచర్‌లు తెలుసుకొండి

ఐకూ నియో 7 5G ధర రూ.29,999. ఈ ధర వద్ద 8 జి‌బి ర్యామ్, 128 జి‌బి స్టోరేజ్ వేరియంట్ లభిస్తుంది. ఈ ఫోన్ 12జి‌బి ర్యామ్‌తో 256జి‌బి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999. ఫోన్ ఫ్రాస్ట్ బ్లూ అండ్ ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ కలర్స్‌లో వస్తుంది. 

iQoo Neo 7 vs Poco X5 Pro: which smartphones is best, from price to camera features know here-sak
Author
First Published Feb 20, 2023, 9:46 AM IST

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్  ఐకూ(iQoo) తాజాగా ఫ్లాగ్‌షిప్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్  ఐకూ నియో 7ను ఇండియాలో విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పరంగా పోకో X5 ప్రొ 5Gకి గట్టి పోటీనిస్తోంది. మీరు కూడా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే ఈ రెండు ఫోన్‌ల మధ్య గందరగోళంలో ఉంటే ఈ వార్తా మీకోసమే...

ఐకూ నియో 7 vs పోకో X5 ప్రొ 5G: ధర
ఐకూ నియో 7 5G ధర రూ.29,999. ఈ ధర వద్ద 8 జి‌బి ర్యామ్, 128 జి‌బి స్టోరేజ్ వేరియంట్ లభిస్తుంది. ఈ ఫోన్ 12జి‌బి ర్యామ్‌తో 256జి‌బి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999. ఫోన్ ఫ్రాస్ట్ బ్లూ అండ్ ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ కలర్స్‌లో వస్తుంది. 

పోకో X5 ప్రొ 5G 128జి‌బి స్టోరేజ్‌తో 8 జి‌బి ర్యామ్‌కు రూ. 22,999, 256జి‌బి స్టోరేజ్‌తో 8 జి‌బి ర్యామ్‌కు రూ. 24,999గా నిర్ణయించింది. ఈ ఫోన్ ఆస్ట్రల్ బ్లాక్, హారిజన్ బ్లూ, పోకో ఎల్లో కలర్ లో వస్తుంది. 

స్పెసిఫికేషన్‌లు
అండ్రాయిడ్ 13 ఫన్ టచ్ ఓఎస్ 13 ఐకూ నియో  7 5Gలో అందించారు.  ఈ ఫోన్ కి 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hz,ఫోన్‌లో 4nm మీడియా టెక్ డైమెన్సిటీ 8200 5G ప్రాసెసర్, గేమింగ్ కోసం గ్రాఫైట్ 3D కూలింగ్ సిస్టమ్ ఉంది. ఫోన్ తో 12జి‌బి వరకు LPDDR5 ర్యామ్, 8 జి‌బి వరకు వర్చువల్ ర్యామ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో 256జి‌బి వరకు UFS 3.1 స్టోరేజ్ ఉంది. ఇంకా ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో ఎనిమిది 5G బ్యాండ్‌లు ఉన్నాయి. 

పోకో X5 ప్రొ 5G 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లే 1080 x 2400 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో, 120 Hz రిఫ్రెష్ రేట్, 10 బిట్ కలర్, 395 PPI పిక్సెల్ డెన్సిటీ, 900 నిట్‌ల వరకు  బ్రైట్ నెస్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఫోన్‌లో ఉంది. స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్‌, 8జి‌బి వరకు LPDDR4x ర్యామ్, 256జి‌బి వరకు UFS 2.2 స్టోరేజ్‌  పొందుతుంది. ఫోన్‌లో ఆండ్రాయిడ్ 12 OS, సెక్యూరిటి కోసం ఫేస్ అన్‌లాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

 కెమెరా 
ఐకూ నియో 7 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌  ఉంది, దీనిలో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్ f/1.79 ఎపర్చర్‌తో వస్తుంది. ప్రైమరీ కెమెరాతో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉంది. ఫోన్‌లో 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ సెకండరీ కెమెరా f/2.4 ఎపర్చరు, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో మూడవ కెమెరా f/2.4 ఎపర్చరు ఉంది. ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. బ్యాక్ కెమెరాతో 4కె వీడియో రికార్డింగ్ చేయవచ్చు. 

పోకో X5 ప్రొ 5Gలో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, సెల్ఫీ అండ్ వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 

 బ్యాటరీ 
ఐకూ నియో 7 5G 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ వస్తుంది. ఫోన్ ఛార్జింగ్ చాలా వేగంగా ఉంటుంది. 10 నిమిషాల్లో ఫోన్ 50 శాతం ఛార్జ్ అవుతుంది. 
పోకో X5 ప్రొ 5G 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios