IPL టోర్నమెంట్ ప్రారంభం కాగానే, వోడాఫోన్ ఐడియా కస్టమర్ల కోసం ఒక గొప్ప ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పుడు అదనపు డేటా, ధర తగ్గింపు సహా పలు ఆఫర్లను తీసుకొచ్చింది.  

 క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ సీజన్ టోర్నీ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ తడబడినా.. అభిమానుల ఆత్మవిశ్వాసం మాత్రం దెబ్బతినలేదు. నెక్స్ట్ మ్యాచ్‌లో ఆర్‌సిబి పుంజుకుంటుందనే నమ్మకంతో ఆ టీం పై నమ్మకంతో ఉన్నారు. అయితే క్రికెట్ ఫీవర్ ఇప్పుడు రోజురోజుకి విస్తరిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్యాన్స్ ఆస్వాదించేందుకు వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు గొప్ప ఆఫర్‌ను ప్రకటించింది. ఈ IPL టోర్నమెంట్‌లో క్రికెట్ వ్యూ అనుభవాన్ని మెరుగుపరచడానికి టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా ఇప్పుడు కొత్త ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌లు అండ్ అదనపు బోనస్ డేటా ప్యాకేజీలను ప్రకటించింది.

వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్‌లు ఇప్పుడు కొత్త ధరలలో డిస్కౌంట్‌లు ఇంకా డేటా ఆఫర్‌లని పొందవచ్చు. మ్యాచ్‌ లైవ్ చూడటం, హైలైట్‌లను క్యాచ్ చేయడం లేదా లేటెస్ట్ స్కోర్‌లతో అప్‌డేట్ అవ్వడం వోడాఫోన్ ఐడియా ప్రతి ప్రాధాన్యతకు సరిపోయే అప్షన్స్ తీసుకొచ్చింది, ఇంకా ప్రతి ఒక్కరి అవసరాలకు తగినట్లుగా ఉంటాయని తెలిపింది. ఇంకా డేటా పరిమితుల గురించి చింతించకుండా వినియోగదారులు క్రికెట్ వ్యూ అనుభవాన్ని పెంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. 

ఈ ఆఫర్‌లు వోడాఫోన్ ఐడియా యాప్‌లో మాత్రమే :

*రూ. 1449 ప్యాక్ (రోజుకు 1.5GB/, వాలిడిటీ: 180 రోజులు, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్)పై కస్టమర్‌లు 50gb అదనపు డేటా పొందుతారు. ఈ ప్యాక్ పై రూ.50 తగ్గింపు ఉంటుంది.

* రూ. 3199 ప్యాక్ (2GB/రోజుకి, వాలిడిటీ: 365 రోజులు, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ + 1 సంవత్సరం Amazon Prime వీడియో మొబైల్ వెర్షన్) రూ.100 తగ్గింపు ఇస్తుంది. ఇంకా 50gb అదనపు డేటా లభిస్తుంది. 

• అదనంగా రూ. 699 ప్యాక్ (3GB/రోజు, వాలిడిటీ: 56 రోజులు, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్) పై రూ.50 తగ్గింపు లభిస్తుంది. అంతరాయం లేని IPL వ్యూ కోసం తగినంత డేటా ఉండేలా ఈ ప్యాక్ ప్రకటించబడింది.

• VI యాప్ రూ. 181 ప్లాన్ పై (డైలీ 1 gb) 50% అదనపు డేటా(రోజుకి 500mb అదనం) ఇంకా రూ. 75 ప్యాక్‌తో 1.5gb అదనపు డేటాను కూడా అందిస్తోంది.

• ఈ ఆఫర్‌లతో పాటు, వినియోగదారులు రూ.298 ప్యాక్‌లో (28 రోజులు) 50GB అదనపు డేటాను ఇంకా రూ.418 ప్యాక్‌లో 100GB డేటాను (56 రోజులు) పొందగలిగే అదనపు ప్రయోజనకరమైన డేటా ప్యాక్‌లు కూడా ఉన్నాయి.

VI ప్రీపెయిడ్ కస్టమర్లందరికీ మార్చి 21, 2024 నుండి ఏప్రిల్ 1, 2024 వరకు వాలిడిటీ అయ్యే ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్‌లపై అదనపు డేటా ఆఫర్‌లను ప్రవేశపెట్టింది.

ఈ రీఛార్జ్ ప్లాన్‌లు డేటా పరిమితిని అందిస్తాయి

*రూ. 1449 ప్లాన్ అదనపు 30GB డేటా, 1.5GB/రోజుకి + 180 రోజులు వాలిడిటీ 

*రూ. 2899 ప్లాన్ అదనపు 50GB డేటా, 1.5GB/రోజుకి + 365 రోజులు వాలిడిటీ 

*రూ. 3099 ప్లాన్ అదనపు 50GB డేటా, 2GB/రోజుకి + 365 రోజులు వాలిడిటీ 

*రూ. 3199 ప్లాన్ అదనంగా 50GB డేటా, 2GB/రోజుకి + 365 రోజులు వాలిడిటీ