iPhone SE 3 vs iPhone SE 2: ధర నుండి ఫీచర్‌ల వరకు రెండు ఫోన్‌ల మధ్య తేడా తెలుసుకోండి
ఐఫోన్ ఎస్‌ఈ 3 (2022) 64 జిబి, 128 జిబి, 256 జిబి స్టోరేజ్ తో ప్రవేశపెట్టారు. ఫోన్ ప్రారంభ ధర రూ.43,900. అదే సమయంలో 128 జిబి మోడల్ ధర రూ. 47,800, 256 జిబి ధర రూ. 58,300.
మార్చి 8న జరిగిన ఈవెంట్‌లో అమెరికన్ టెక్నాలజి దిగ్గజం ఆపిల్ (Apple) ఐఫోన్ (iPhone)SE3ని విడుదల చేసింది, అంటే ఈ ఫోన్ ఐఫోన్ ఎస్‌ఈ 2కి అప్‌గ్రేడ్ వెర్షన్ . ఐఫోన్ ఎస్‌ఈ 3ని కొత్త ప్రాసెసర్ ఇంకా ఎన్నో కొత్త మార్పులతో ప్రవేశపెట్టింది. ఈ ఈవెంట్‌లో ఆపిల్ కొత్త గ్రీన్ కలర్ వేరియంట్‌లో ఐఫోన్ 13, ఆల్పైన్ గ్రీన్ కలర్ వేరియంట్‌లో ఐఫోన్ 13 ప్రోని పరిచయం చేసింది. ఆపిల్ A15 బయోనిక్ ప్రాసెసర్‌తో కూడిన iPhone SE 3ని కూడా పరిచయం చేసింది. ఈ ప్రాసెసర్ గత సంవత్సరం ప్రారంభించిన ఐఫోన్ 13 సిరీస్‌లో ఉపయోగించారు.
ఐఫోన్ ఎస్‌ఈ 2 అండ్ ఐఫోన్ ఎస్‌ఈ 2 మధ్య తేడా ఏంటి ?
ఐఫోన్ ఎస్‌ఈ 2022 vs ఐఫోన్ ఎస్‌ఈ 2: ధర
ఐఫోన్ ఎస్‌ఈ 3ని 64 జిబి, 128 జిబి అండ్ 256 జిబి స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.43,900. 128జిబి మోడల్ ధర రూ. 47,800, 256జిబి ధర రూ. 58,300. ఐఫోన్ ఎస్‌ఈ 2ని రూ. 42,500 ధర వద్ద ప్రారంభించారు, అయితే ఇప్పుడు మీరు ఈ ఫోన్‌ను 30 వేల రూపాయల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ ఎస్‌ఈ 2022 vs ఐఫోన్ ఎస్‌ఈ 2: స్పెసిఫికేషన్‌లు
ఐఫోన్ ఎస్‌ఈ 3, iOS 15 ఫీచర్ల గురించి మాట్లాడితే ఇందులో ఫోటో ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి. ఇంకా 5G కనెక్టివిటీతో గతం కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఈ ఫోన్ స్మార్ట్ హెచ్‌డిఆర్ 4, ఫోటోగ్రాఫిక్ స్టైల్, డీప్ ఫ్యూజన్ వంటి ఐఫోన్ 13 సిరీస్ కెమెరా ఫీచర్లను పొందుతుంది.
ఐఫోన్ SE 3 4.7-అంగుళాల డిస్‌ప్లేతో అత్యంత కఠినమైన గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13లో లాగే అదే గ్లాస్ కొత్త ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఉపయోగించారు. వాటర్ రెసిస్టెంట్ కోసం ఫోన్ IP67 రేటింగ్ పొందింది. ఫోన్ హోమ్ బటన్‌లో టచ్ ఐడి ఇచ్చారు. ఫోన్‌తో పాటు 12 మెగాపిక్సెల్‌ల సింగిల్ రియర్ కెమెరా లభిస్తుంది, దీని ఎపర్చరు / 1.8. ఇందులో వైడ్ యాంగిల్ కూడా ఉంటుంది. ఇంకా 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. దీనితో డ్యూయల్ సిమ్ సపోర్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉంది.
ఐఫోన్ SE 2 కూడా HDR10 ప్లేబ్యాక్, డాల్బీ విజన్‌కు సపోర్ట్ తో 4.7-అంగుళాల రెటినా హెచ్‌డి డిస్‌ప్లే ఉంటుంది. అంతే కాకుండా టచ్ ఐడీ కూడా ఇచ్చారు. iPhone SE 2లో A13 బయోనిక్ ప్రాసెసర్, సింగిల్ బ్యాక్ కెమెరా సెటప్ ఉంది, అంటే 12 మెగాపిక్సెల్‌లు దాని ఎపర్చరు F / 1.8. మీరు కెమెరాతో 4K వీడియోగ్రఫీని కూడా చేయవచ్చు. సెల్ఫీ కోసం 7 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
HDR, పోర్ట్రెయిట్ వంటి ఫీచర్లు కెమెరాతో అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ వాటర్, డస్ట్ ప్రూఫ్. ఐఫోన్ IP 67 రేటింగ్‌ను పొందింది. iPhone SE 2 బ్లాక్, వైట్, రెడ్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ SE 2లో బలమైన బ్యాటరీ ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది.
ఫోన్ బాడీ గ్లాస్, ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేసారు. ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ SE 2 బ్యాటరీ 30 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.