ఈజీ మనీ ట్రాన్సఫర్: ఇండియా నుండి మరొక దేశానికి.. త్వరలో యూ‌పి‌ఐ అండ్ పేనవ్ సర్వీసెస్..

 ఇరు దేశాల మధ్య అతి తక్కువ చార్జ్ తో క్యాష్ ట్రాన్సఫర్ సాధ్యమవుతుందని సింగపూర్‌లోని భారత హైకమిషనర్ పి.కుమరన్ తెలిపారు. అయితే ఈ సర్వీస్ వలస కార్మికులకు చాలా సౌకర్యంగా ఉండనుంది. 

Instant money transfer between India and Singapore, UPI and PayNow link service soon

ఇండియా అండ్ సింగపూర్ మధ్య క్యాష్ ట్రాన్సఫర్ కోసం యూ‌పి‌ఐ ఇంకా పే నవ్ సర్వీసెస్ త్వరలో ప్రారంభం కానుంది. ఇందుకు రెండు దేశాల ప్రజల మధ్య ఇన్స్టంట్ మని ట్రాన్సఫర్ లింక్‌ కోసం టెక్నికల్ సన్నాహాలు పూర్తయ్యాయి. 

దీంతో ఇరు దేశాల మధ్య అతి తక్కువ చార్జ్ తో క్యాష్ ట్రాన్సఫర్ సాధ్యమవుతుందని సింగపూర్‌లోని భారత హైకమిషనర్ పి.కుమరన్ తెలిపారు. అయితే ఈ సర్వీస్ వలస కార్మికులకు చాలా సౌకర్యంగా ఉండనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అండ్ సింగపూర్ సెంట్రల్ బ్యాంక్  మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (MAS) రెండు దేశాల క్విక్ మని ట్రాన్సఫర్ లింక్‌లను అనుసంధానించే పనిలో ఉన్నాయని,  త్వరలో ప్రారంభం కావచ్చని ఆయన అన్నారు. 


సింగపూర్  PayNowని భారతదేశ UPIతో కనెక్ట్ చేయాలనుకుంటున్నట్లు అలాగే  రానున్న నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని తరువాత సింగపూర్‌లో ఉన్న ఏ వ్యక్తి అయినా భారతదేశంలోని అతని కుటుంబ సభ్యులకు డబ్బు పంపవచ్చని ఆయన చెప్పారు.

లింక్ లింకింగ్ వర్క్ లాంఛనంగా పూర్తయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టును ప్రకటిస్తారని కుమరన్ తెలిపారు. దీని వల్ల ప్రవాసులు భారతదేశానికి డబ్బు పంపడం సులభతరం అవుతుందని ఇందుకు వారు  చాలా తక్కువ చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. సింగపూర్ PayNow భారతదేశ డోమెస్టిక్ కార్డ్ పేమెంట్ నెట్‌వర్క్ రూపే లాగానే ఉంటుంది. 

సింగపూర్‌లోని భారత రాయబారి కుమరన్‌ చేసిన ప్రకటన ASEAN, మిత్ర దేశాల సమావేశానికి ముందు వెలువడింది. కంబోడియా రాజధాని నమ్‌పెన్‌లో ప్రారంభమయ్యే ఈ సమావేశానికి 10 ప్రాంతీయ  దేశాల నేతలు హాజరుకానున్నారు. ప్రస్తుతం మనీ ట్రాన్స్‌ఫర్ కంపెనీలను ఆశ్రయించాల్సి వచ్చిందని కుమరన్ చెప్పారు. 

వలస కార్మికులు దీని ద్వారా పెద్ద మొత్తంలో ఒకేసారి పంపే బదులు చిన్న మొత్తాలను భారతదేశానికి పంపవచ్చు అలాగే చార్జెస్ కూడా తక్కువగా ఉంటాయి. PayNow కూడా ASEAN అండ్ అనుబంధ దేశాలకు అనుసంధానించబడి ఉంటుంది, కాబట్టి దీని ద్వారా ASEAN ప్రాంతం అంతటా ప్రజల కొనుగోళ్ళు  ఇంకా అమ్మకాలు సులభం అవుతుంది. ఈ విధంగా ఇండియా అండ్ ASEAN పేమెంట్ నెట్‌వర్క్‌కు అనుసంధానించబడతాయి. ప్రస్తుతం ఫిలిప్పీన్స్ దీనికి అనుసంధానించి ఉంది. మలేషియా ఇంకా థాయిలాండ్ పేమెంట్ వ్యవస్థలు కూడా దీనికి అనుసంధానించబడి ఉన్నాయి. ASEANలో బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాంతో మొత్తం 10 దేశాలు ఉన్నాయి.   

సింగపూర్‌లో 2 లక్షల మంది భారతీయ నిపుణులు పనిచేస్తున్నారని అంచనా. అయితే వీరు తరచూ వారి ఇళ్లకు డబ్బులు పంపుతూనే ఉంటారు. UPI-PayNow లింక్ వారికి చాలా ప్రయోజనాలు ఇంకా సేవింగ్స్ తెస్తుంది, మరోవైపు  ప్రైవేట్ కంపెనీలు డబ్బు పంపడానికి 10 శాతం వరకు వసూలు చేస్తున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios