Asianet News TeluguAsianet News Telugu

ఇన్‌స్టాగ్రామ్ అప్‌డేట్: మీరు మీ ఇన్‌స్టాగ్రామ్‌తో కూడా ఫేస్‌బుక్‌లో రీల్స్‌ను పోస్ట్ చేయవచ్చు ఎలా అంటే..?

ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి  ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో యూజర్లను దృష్టిలో ఉంచుకుని  రీల్స్‌ను అప్‌డేట్ చేస్తున్నట్లు ట్వీట్ ద్వారా ప్రకటించారు. ఈ అప్‌డేట్‌తో యూజర్లు ఒకే క్లిక్‌తో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ఫేస్‌బుక్ రీల్స్ ఇన్‌సైట్‌లకు పోస్ట్ చేయవచ్చు.
 

Instagram Reels Update Now you can post reels on Facebook with Instagram learn this in easy way
Author
Hyderabad, First Published Aug 22, 2022, 5:15 PM IST

ఫోటో-వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్  రీల్స్‌లో మరో కొత్త ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. ఈ ఫీచర్ సహాయంతో  యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను డైరెక్ట్ గా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయవచ్చు. టిక్‌టాక్ తర్వాత ఇండియాలో యువతకు బాగా నచ్చిన యాప్ ఇన్‌స్టాగ్రామ్. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ టిక్‌టాక్ ఫీచర్లను కాపీ చేయడంపై ఆరోపణలు వచ్చాయి, ఆ తర్వాత ఫీచర్‌లో కొంత మార్పు చేస్తున్నట్టు పేర్కొంటూ ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్‌ను ఉపసంహరించుకుంది.

ఆడమ్ మోస్సేరి ప్రకటన
ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి  ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో యూజర్లను దృష్టిలో ఉంచుకుని  రీల్స్‌ను అప్‌డేట్ చేస్తున్నట్లు ట్వీట్ ద్వారా ప్రకటించారు. ఈ అప్‌డేట్‌తో యూజర్లు ఒకే క్లిక్‌తో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ఫేస్‌బుక్ రీల్స్ ఇన్‌సైట్‌లకు పోస్ట్ చేయవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్స్ ఇప్పుడు ఫేస్‌బుక్‌లో కూడా రీల్స్‌ను అప్‌లోడ్ చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ ఫీచర్‌తో పాటు కొత్త రీల్ టెంప్లేట్లు, రీల్ రీమిక్స్ అండ్ రీల్ వీడియో మెర్జ్ వంటి కొత్త రీల్ ఫీచర్‌లను కూడా ఆడమ్ మోస్సేరి ప్రకటించారు. 

ఇలా ఉపయోగించవచ్చు
ముందుగా మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ని ఓపెన్ చేయాలి. దీని తరువాత రీల్స్ అందులో రికార్డ్ చేయాలి. రీల్‌ను రికార్డ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి ఇక్కడ షేర్ టు ఫేస్‌బుక్ ఆప్షన్ ద్వారా మీ ఫేస్‌బుక్ అక్కౌంట్ సెలెక్ట్ చేసుకొని షేర్‌పై నొక్కండి.

మీరు Facebookలో Instagram రీల్స్‌ను ఆటోమేటిక్‌గా షేర్ చేయాలనుకుంటే మీరు మీ Instagram ప్రొఫైల్‌కి వెళ్లి మోర్ ఆప్షన్ పై నొక్కండి. ఆ తర్వాత సెట్టింగ్స్ లో అకౌంట్ ఆప్షన్‌కు వెళ్లండి. ఇక్కడ ఇతర యాప్‌లకు షేర్ చేయడంపై నొక్కండి అలాగే ఇక్కడ Facebook అక్కౌంట్ యాడ్ చేయండి. మీరు మీ Facebook ఖాతాలో కూడా మీ Instagram అక్కౌంట్ తో ఏకకాలంలో రీల్స్‌ను పోస్ట్ చేయవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios