Instagram shock:ఇన్‌స్టాగ్రామ్ షాక్.. ఈ యాప్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటన..

ఐజిటివి యాప్‌ను ఇన్‌స్టాగ్రామ్ 2018లో ప్రారంభించింది.  అయితే ఇప్పుడు సుమారు నాలుగు సంవత్సరాల తరువాత కంపెనీ ఐజిటివిని మూసివేస్తోంది.  

Instagram gave a shock: announced the closure of this app was launched in 2018

ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ గా ప్రారంభంమైన ఇన్‌స్టాగ్రామ్(Instagram ) ఇప్పుడు షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్‌గా కూడా మారింది. ఇన్‌స్టాగ్రామ్ దృష్టి ఇప్పుడు ఎక్కువగా షార్ట్ వీడియో రీల్స్‌పై పెట్టింది. అయితే ఇన్‌స్టాగ్రామ్ ఐ‌జి‌టి‌వి (IGTV)యాప్‌ను మూసివేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఐజిటివి యాప్‌ను మూసివేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐజిటివి యాప్‌ను ఇన్‌స్టాగ్రామ్ 2018లో ప్రారంభించింది. అయితే ఇప్పుడు సుమారు నాలుగు సంవత్సరాల తరువాత కంపెనీ ఐజిటివి మూసివేస్తోంది.  

రీల్స్‌పై దృష్టి 
భారతదేశంలో చైనీస్ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ నిషేధం తర్వాత ఇన్‌స్టాగ్రామ్ 2020లో రీల్స్‌ను పరిచయం చేసింది. రీల్స్ నేడు భారతీయ మార్కెట్లో ప్రముఖ షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్‌గా ఉంది. రీల్స్‌కు సంబంధించి ఇటీవల కంపెనీ  యాడ్స్ ఫీచర్‌ను త్వరలో విడుదల చేయబోతోందని, ఆ తర్వాత రీల్స్ క్రియేటర్స్ డబ్బు సంపాదించడం ప్రారంభిస్తారని తెలిపింది. ప్రస్తుతం, రీల్స్‌తో మానిటైజేషన్ వంటి సదుపాయం లేదు. కంపెనీ ప్రకారం త్వరలో రీల్స్ వీడియోలలో యాడ్స కనిపిస్తాయి.

రీల్స్ గత నెలలో 150 దేశాలలో
ఫేస్ బుక్ గత నెలలో 150 దేశాలలో షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్ రీల్స్‌ను ప్రారంభించింది. మెటా ఈ సమాచారాన్ని బ్లాగ్ ద్వారా అందించింది. వీడియో క్రియేటర్‌లు డబ్బు సంపాదించడానికి కొత్త ఫీచర్‌లను కూడా ప్రవేశపెడతామని మెటా తెలిపింది. మెటా ప్రకారం రీల్స్ వినియోగదారులు వీటి ద్వారా బోనస్ పొందుతారు. 

అంతేకాకుండా బ్యానర్లు, స్టిక్కర్ల రూపంలో ఉండే వీడియో మధ్యలో యాడ్స్ చూపబడతాయి. రీల్స్‌లో ఫుల్ స్క్రీన్ యాడ్స్ కూడా త్వరలో విడుదల కానున్నాయి. ఫేస్‌బుక్ వినియోగదారులు కూడా త్వరలో రీల్స్‌ను చూడవచ్చు. ఫేస్‌బుక్ స్టోరీస్ ఫీచర్‌కు బదులుగా రీల్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. వినియోగదారులు  న్యూస్ ఫీడ్‌లో రీల్‌లను చూడవచ్చు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios