ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. కొన్ని లక్షల మంది ఈ సమస్యను ఎదుర్కుంటున్నట్టుగా డౌన్ డిటెక్టర్ సైట్ అధికారికంగా పేర్కొంది. ట్విట్టర్ లో ఇందుకు సంబంధించి ట్రెండ్ అవడంతోపాటుగా రకరకాల మీమ్స్ వైరల్ గా మారాయి. 

ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ (Facebook), ఇంస్టాగ్రామ్ (Instagram), వాట్సాప్ (Whatsapp)సేవలు నిలిచిపోయాయి. కొన్ని లక్షల మంది ఈ సమస్యను ఎదుర్కుంటున్నట్టుగా డౌన్ డిటెక్టర్ సైట్ అధికారికంగా పేర్కొంది. ట్విట్టర్ (Twitter) లో ఇందుకు సంబంధించి ట్రెండ్ అవడంతోపాటుగా రకరకాల మీమ్స్ వైరల్ గా మారాయి. 

Scroll to load tweet…

మొత్తంగా ఫేస్ బుక్ కి చెందిన మూడు సోషల్ మీడియా ప్లాట్ ఫారంలు ఒకేసారి పనిచేయకపోవడంతో నెటిజన్లు ట్విట్టర్ కి వచ్చి అసలు ఏమి జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. వాట్సాప్ పనిచేయకపోతే ఎలా అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తుండగా... మరికొందరు టెలిగ్రామ్ తో పని కానిస్తున్నారు. 

Also Read: ఇ-మెయిల్, జి‌-మెయిల్ అంటే ఏంటి..? ఈ రెండింటికి మధ్య తేడా మీకు తెలుసా..?

Scroll to load tweet…

గ్రూప్స్ ని మెసేజెస్ కోసం అత్యధికంగా వాడేవారు ఇప్పటికిప్పుడు టెలిగ్రామ్ (Telegram) గ్రూపులను కూడా క్రియేట్ చేసుకుని వారి పనిని కూడా మొదలుపెట్టారు. వాట్సాప్ పనిచేయకపోయే సరికి చాల మంది తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి మరల తిరిగి ఆన్ చేశామని, అయినాకూడా వాట్సాప్ పనిచేయకపోవడంతో అప్పుడు అసలు విషయం అర్థమైందని పేర్కొన్నారు. 

Scroll to load tweet…

చాలా మంది వారి మిత్రులకు, ఇతర కుటుంబ సభ్యులకు కాల్ చేసి వారి వాట్సాప్ పనిచేస్తుందో లేదో తెలుసుకున్నట్టుగా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ సేవలు నిలిచిపోయాయి. 

Scroll to load tweet…

వీటికి సంబంధించి ఏ విధమైన మీమ్స్ ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాయో మీరు కూడా ఒక లుక్కేయండి..!

Scroll to load tweet…
Scroll to load tweet…