Asianet News TeluguAsianet News Telugu

ఇన్ఫినిక్స్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది.. 50 మెగాపిక్సెల్ కెమెరాతో 7జి‌బి వరకు ర్యామ్..

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్‌ఓ‌ఎస్ 10.6 ఇన్ఫినిక్స్ నొత్ 12ఐలో ఇచ్చారు. అంతేకాకుండా 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల హెచ్‌డి + ఐ‌పి‌ఎస్ డిస్‌ప్లేతో వస్తుంది.

Infinix launches cheap smartphone, will get 50 megapixel camera
Author
hyderabad, First Published May 13, 2022, 4:49 PM IST

హాంగ్ కాంగ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) నోట్ 12ఐని కెన్యాలో లాంచ్ చేసింది. అయితే భారతీయ, ఇతర మార్కెట్లలో ఈ ఫోన్ లాంచ్ గురించి ఎటువంటి వార్తలు లేవు. Infinix Note 12i మూడు కలర్ వేరియంట్‌లలో పరిచయం చేసారు. అంతేకాకుండా ఈ ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లే, మూడు వెనుక కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్‌లు. Infinix Note 12i కూడా DTS ఆడియోకు సపోర్ట్ తో రెండు స్పీకర్లతో వస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 12ఐ ధర
ఇన్ఫినిక్స్  అధికారిక వెబ్‌సైట్‌లో ఫోన్ ధర, లభ్యత గురించి ఇంకా ఎటువంటి సమాచారం అప్‌డేట్ చేయలేదు. ఈ ఫోన్ కెన్యాలోని ఒక ఇ-కామర్స్ సైట్‌లో KES 20,500 అంటే దాదాపు రూ. 13,600కి జాబితా చేయబడింది. RAM-స్టోరేజ్‌తో అంటే 4జి‌బి ర్యామ్ తో 128జి‌బి స్టోరేజ్‌ ఉంటుంది. Infinix Note 12iని సన్‌సెట్ గోల్డెన్, జ్యువెల్ బ్లూ, ఫోర్స్ బ్లాక్ కలర్‌లలో కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్లు
 Android 12 ఆధారిత XOS 10.6 ఇచ్చారు. అంతేకాకుండా 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల హెచ్‌డి + IPS డిస్‌ప్లే ఉంది. గ్రాఫిక్స్ కోసం Mali-G52 MC2 GPUతో MediaTek Helio G85 ప్రాసెసర్, 4జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్  ఉంది. వర్చువల్ పద్ధతిలో ర్యామ్ ని 7 జి‌బి వరకు పెంచుకోవచ్చు.

Infinix Note 12i కెమెరా గురించి మాట్లాడితే ఇందులో మూడు బ్యాక్ కెమెరాలు ఇచ్చారు, దీని ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్స్, ఎపర్చరు f/1.8 ఉంది. రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్, మూడవ లెన్స్ VGA. కెమెరాతో పాటు క్వాడ్ LED లైట్ ఉంది. ఈ ఫోన్ సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

కనెక్టివిటీ కోసం, ఈ Infinix ఫోన్‌లో Dual Band Wi-Fi, బ్లూటూత్ v5, GPS, USB OTG, USB టైప్-C 2.0 పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 5000mAh బ్యాటరీ ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios