Asianet News TeluguAsianet News Telugu

ఆతితక్కువ ధరకే 43-అంగుళాల స్మార్ట్ టీవీ.. బ్లూటూత్, వై-ఫైతో బెస్ట్ ఫీచర్స్...

ఇన్ఫినిక్స్ 43Y1 ఫుల్ హెచ్‌డి రిజల్యూషన్‌తో 43-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. డిస్ ప్లే బ్రైట్ నెస్ 300 నిట్స్,  ఇది HLGతో స్పష్టమైన ఫీచర్స్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. 20W స్పీకర్ ఇన్ఫినిక్స్ 43Y1తో అందించారు, ఈ స్పీకర్ డాల్బీ అట్మోస్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.

Infinix launches 43-inch smart TV for Rs 13,999, know all the features
Author
First Published Oct 13, 2022, 3:02 PM IST

హాంగ్ కాంగ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ ఇండియన్ మార్కెట్లో కొత్త స్మార్ట్ టి‌వి ఇన్ఫినిక్స్ 43వై1ని లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ 43Y1తో పాటు కంపెనీ ఇన్ఫినిక్స్ InBook X2 Plus ల్యాప్‌టాప్‌ను కూడా విడుదల చేసింది. ఎల్‌ఈ‌డి డిస్ ప్లే ఇన్ఫినిక్స్ 43Y1తో అందించారు ఇంకా డాల్బీ ఆడియోకి కూడా సపోర్ట్ ఉంది. అంతేకాకుండా ఈ టీవీలో 20W స్పీకర్ కూడా ఉంది. ఇన్ఫినిక్స్ 43Y1 ధర రూ. 13,999, దీనిని ఫ్లిప్ కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రస్తుతం సేల్ తేదీ గురించి ఎటువంటి సమాచారం లేదు.

ఇన్ఫినిక్స్ 43Y1 స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్స్ 
ఇన్ఫినిక్స్ 43Y1 ఫుల్ హెచ్‌డి రిజల్యూషన్‌తో 43-అంగుళాల స్క్రీన్‌ లభిస్తుంది. డిస్ ప్లే బ్రైట్ నెస్ 300 నిట్‌లు ఇంకా HLGతో స్పష్టమైన ఫీచర్స్ కి కూడా సపోర్ట్ ఉంది. 20W స్పీకర్ ఇన్ఫినిక్స్ 43Y1తో అందించారు, డాల్బీ అట్మోస్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.

ఇన్ఫినిక్స్ 43Y1 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 4జి‌బి స్టోరేజ్  పొందుతుంది. ర్యామ్ గురించి సమాచారం ఇవ్వలేదు. ఇన్ఫినిక్స్ 43Y1కి  రెండు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు, ఒక RF ఇన్‌పుట్, AV ఇన్‌పుట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ ఉంటాయి. టీవీతో పాటు Wi-Fi, బ్లూటూత్ కూడా అందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియొ, యూట్యూబ్, సోని లీవ్, జి5, ఎరాస్ నవ్ వంటి యాప్‌లు ఇన్ఫినిక్స్ 43Y1లో సపోర్ట్ చేస్తాయి. మీరు మీ అండ్రాయిడ్ ఫోన్‌ని కూడా దీనిలో క్యాస్ట్ చేఅంటే స్క్రీన్ క్యాస్ట్ చేయవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios