indian 5g smartphones:రూ. 15వేల లోపు లభించే ఐదు దేశీయ కంపెనీల స్మార్ట్ఫోన్లు ఇవే..
గత సంవత్సరం లావా మొదటిసారిగా లావా అగ్ని 5జి (lava agni 5g) ఫోన్‌ను లాంచ్ చేసింది, ఈ ఫోన్ భారతీయ కంపెనీ విడుదల చేసిన మొదటి 5G ఫోన్. మరోవైపు మైక్రోమ్యాక్స్ ఇంకా 5జిలోకి ప్రవేశించలేదు,
గతంలో చైనా కంపెనీల ఫోన్లు భారత మార్కెట్‌లో భారీగా లాంచ్ అవుతుండగా గత రెండేళ్లుగా ఇందులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. వీటిలో మైక్రోమ్యాక్స్, లావా వంటి దేశీయ కంపెనీలు ముందున్నాయి. గత సంవత్సరం లావా మొదటిసారిగా లావా అగ్ని 5జి (lava agni 5g) ఫోన్‌ను లాంచ్ చేసింది, ఈ ఫోన్ భారతీయ కంపెనీ విడుదల చేసిన మొదటి 5G ఫోన్. మరోవైపు మైక్రోమ్యాక్స్ ఇంకా 5జిలోకి ప్రవేశించలేదు, కాని బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కంపెనీకి చెందిన ఎన్నో 4జి ఫోన్‌లు ఉన్నాయి. అయితే రూ. 15,000 కంటే తక్కువ ధర ఉన్న దేశీయ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌ల గురించి చూద్దాం..
మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి
మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి ప్రారంభ ధర రూ.7,999. ఈ ధర వద్ద 4జిబి RAMతో 64జిబి స్టోరేజ్ లభిస్తుంది. అలాగే 6 జీబీ ర్యామ్‌తో 64 జీబీ స్టోరేజ్ ధర రూ.8,999. ఆండ్రాయిడ్ 11 మైక్రోమ్యాక్స్ ఇన్ 2బిలో ఇచ్చారు. 6.52-అంగుళాల HD + డిస్‌ప్లేతో 400 నిట్‌ల బ్రైట్‌నెస్ ఉంది. ఫోన్ లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ Unisoc T610 ప్రాసెసర్ ఉంది. దీనిలో 64 GB వరకు స్టోరేజ్‌తో పాటు 6 GB వరకు RAMని ఉంది, దీన్ని మెమరీ కార్డ్ సహాయంతో 256కి పెంచుకోవచ్చు. కెమెరా గురించి మాట్లాడితే దీనిలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 13 మెగాపిక్సెల్స్ ఎపర్చరు f/1.8 ఉంది. రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్. కెమెరాతో నైట్, పోర్ట్రెయిట్, బ్యూటీ, మోషన్ ఫోటో వంటి మోడ్‌లు ఉన్నాయి. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
మైక్రోమ్యాక్స్ ఐఎన్ 1
4 GB RAM, 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,499. 6 GB RAMతో 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999. స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే మీరు ఆండ్రాయిడ్ 10లో స్టాక్ ఆండ్రాయిడ్‌ని పొందుతారు. 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ నాచ్ డిస్‌ప్లే, 2400 * 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్ ఉంది. Widevine L-1 కూడా ఫోన్‌తో సపోర్ట్ చేస్తుంది, అంటే మీరు Netflix, Amazon Prime వీడియో HD వీడియోలను సౌకర్యవంతంగా చూడగలరు. ఫోన్‌లో ఎలాంటి బ్లోవేర్‌లు అంటే అనవసరమైన యాప్‌లు ముందుగా ఇన్‌స్టాల్ చేయబడవు. అంతేకాకుండా ఫోన్‌లో MediaTek Helio G80 ప్రాసెసర్ ఇచ్చారు. 4 GB / 6 GB RAM అండ్ 64 GB / 128 GB స్టోరేజ్ ఉంది, మెమరీ కార్డ్ సహాయంతో దీనిని 256 GBకి పెంచవచ్చు. రాబోయే రెండేళ్లపాటు ఫోన్‌తో అప్‌డేట్‌లు అందుబాటులో ఉంటాయి.
లావా అగ్ని 5జి
ఈ ఫోన్ రూ. 15,000 కంటే ఏక్కువ రేంజ్‌లో ఉంది కానీ భారతీయ కంపెనీకి చెందినది. Lava Agni 5G ధర రూ.19,999గా ఉంచబడింది. ఈ ధర వద్ద 8 GB RAM, 128 GB స్టోరేజ్‌తో కూడిన వేరియంట్ అందుబాటులో ఉంటుంది. లావా అగ్ని 5G 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 810 ప్రాసెసర్, 8 GB RAM, 128 GB స్టోరేజ్ ఉన్నాయి. ఫోన్‌లో నాలుగు వెనుక కెమెరాలు ఉన్నాయి, దీని ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్‌లు ఎపర్చరు f / 1.79 ఉంది. రెండవ లెన్స్ 5 మెగాపిక్సెల్స్. మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్ డెప్త్ అండ్ నాల్గవ లెన్స్ 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ లభిస్తాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. సూపర్ నైట్ మోడ్, ప్రో మోడ్ అండ్ AI వంటి మోడ్‌లు కెమెరాతో ఇచ్చారు. కనెక్టివిటీ కోసం, ఫోన్‌లో 5G, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS/ A-GPS మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. లావా అగ్ని 5G సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 90 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అవుతుందని చెబుతున్నారు.
మైక్రోమ్యాక్స్ నోట్
మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2 ప్రారంభ ధర రూ. 13,490. ఈ ధర వద్ద, 4 GB RAMతో 64 GB స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2లో ఇచ్చారు అంతేకాకుండా 6.43-అంగుళాల పూర్తి HD ప్లస్ AMOLED డిస్‌ప్లే ఉంది, దీనికి 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను ఉంది. డిస్ప్లే బ్రైట్ నెస్ 550 నిట్స్ ఇంకా రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ ఇచ్చారు. ఈ ఫోన్‌లో MediaTek Helio G95 ప్రాసెసర్, 4GB RAM, 64GB స్టోరేజ్ ఉన్నాయి, వీటిని మెమరీ కార్డ్ సహాయంతో పెంచుకోవచ్చు. ఈ మైక్రోమ్యాక్స్ ఫోన్‌లో నాలుగు వెనుక కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్. రెండవ లెన్స్ 5 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ అండ్ మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ మాక్రో. నాల్గవ లెన్స్ 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. సెల్ఫీల కోసం మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 2లో 16-మెగాపిక్సెల్ కెమెరా ఉంది.