నిఫ్టీ ఫీచర్ DEFY గ్రావిటీ Zలో కూడా ఇచ్చారు, అయితే కంపెనీ దాని ఉపయోగం గురించి సమాచారం ఇవ్వలేదు. DEFY గ్రావిటీ Zకి టచ్‌  సపోర్ట్ ఉంది, దీని సహాయంతో మీరు కాల్స్ స్వీకరించవచ్చు  లేదా రిజెక్ట్ చేయవచ్చు. 

ఇండియన్ కంపెనీ డెఫి (DEFY) తాజాగా డెఫి గ్రావిటీ Z అనే ఒక కొత్త ఇయర్ బడ్స్ ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. డెఫి గ్రావిటీ Z బ్యాటరీ 50 గంటల బ్యాకప్‌ ఇస్తుందని కంపెనీ తెలిపింది. DEFY గ్రావిటీ Zతో బెటర్ కాల్స్ కోసం క్వాడ్ మైక్ ఇచ్చారు. దానికి ENC సపోర్ట్ ఉంది. DEFY గ్రావిటీ Z 13ఎం‌ఎం డైనమిక్ డ్రైవర్‌తో శక్తివంతమైన బేస్ బూస్ట్ సౌండ్‌ ఉంటుంది అని పేర్కొంది. EFY గ్రావిటీ Zతో గేమింగ్ కోసం 50ms లో లేటెన్సీ మోడ్ ఉంటుంది.

నిఫ్టీ ఫీచర్ DEFY గ్రావిటీ Zలో కూడా ఇచ్చారు, అయితే కంపెనీ దాని ఉపయోగం గురించి సమాచారం ఇవ్వలేదు. DEFY గ్రావిటీ Zకి టచ్‌ సపోర్ట్ ఉంది, దీని సహాయంతో మీరు కాల్స్ స్వీకరించవచ్చు లేదా రిజెక్ట్ చేయవచ్చు. కనెక్టివిటీ కోసం క్విక్ పెయిర్ ఇందులో ఉంది. అంతేకాకుండా బ్లూటూత్ v5.2 అందించారు.

DEFY గ్రావిటీ Z బ్యాటరీ విషయానికొస్తే 50 గంటల బ్యాకప్‌ ఉంటుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. ఛార్జింగ్‌కు సంబంధించి 10 నిమిషాల ఛార్జింగ్ తర్వాత 3 గంటల బ్యాకప్ క్లెయిమ్ చేసింది. ఇంకా వాటర్ రెసిస్టెంట్ కోసం IPX4 రేటింగ్ పొందింది.

DEFY గ్రావిటీ Z ధర రూ. 999. DEFY అనేది 2021లో ప్రారంభించిన పంజాబీ సింగర్ గురు రంధవా బ్రాండ్. DEFYలో నెక్‌బ్యాండ్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు, వైర్డు ఇయర్‌బడ్‌లు కూడా ఉన్నాయి.