పారిస్: హువావే తాజాగా విపణిలోకి నూతన ఫ్లాగ్ షిప్ ఫోన్లు ఆవిష్కరించింది. పీ40, పీ 40 ప్రో, పీ 40 ప్రో ప్లస్ పేర్లతో ఆవిష్కరించిన ఈ ఫోన్లలో గొప్ప స్పెషిపికేషన్లు లభ్యం కానున్నాయి. అయితే గూగుల్ మ్యాప్స్, జీమెయిల్, గూగుల్ ప్లే స్టోర్ తదితర సెర్చింజన్ యాప్స్ ఏమీ లేకుండానే ఈ ఫోన్ విపణిలోకి అడుగు పెట్టడం గమనార్హం. 

హువావేతో వ్యాపార సంబంధ బాందవ్యాలు పెట్టుకోవద్దని అమెరికా టెక్ సంస్థలపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో సదరు సంస్థలు తమ సాఫ్ట్ వేర్ అందించడం నిలిపివేశాయి. దీంతో హువావే సొంత ఆపరేటింగ్ వ్యవస్థ, యాప్స్‌ను రూపొందించింది. 

ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీలలో విక్రయించనున్న ఈ ఫోన్ ధర 880-1540 డాలర్ల మధ్య ఉంటుందని హువావే తెలిపింది. ఈ ఫోన్ లో ఐరోపా సెర్చింజన్ క్వాంట్ ను వినియోగిస్తున్నారు. ఈ మోడల్ ఫోన్లు ఏప్రిల్ ఏడో తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. 

ప్రస్తుతానికి హువావేతో వాణిజ్య సంబంధాల విషయంలో ఇబ్బందులు ఉన్నా మున్ముందు గూగుల్ యాప్స్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. హువావే రూపొందించిన కోర్ ఫీచర్లు గూగుల్ సర్వీసెస్ తో సంబంధం లేనివే కావడం గమనార్హం. ఇప్పుడు హువావేకు సొంతంగా యాప్స్ స్టోర్ ఉంది. ఇవి గూగుల్ యాప్స్ ప్రత్యామ్నాయంగా సేవలు అందించనున్నాయి. 

ఇంతకుముందే గూగుల్ సేవలను చైనా నిలిపివేసింది. మీరు చైనాలో లేకపోతే హువావే పీ40 ఫోన్ కొనుగోలు చేయవద్దని సిఫారసు చేస్తామంటున్నారు టెక్ నిపుణులు. ఈ ఫోన్‌లో పని చేసే ఆండ్రాయిడ్, ఐఓఎస్ బోల్డు పరిమితులు కలిగి ఉన్నాయి. 

ఇంతకుముందు హువావే పీ సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. కానీ ఇంప్రెసివ్ కెమెరా సెన్సర్లు తాజా ఫోన్లలో ఉన్నాయి. పీ40, పీ 40 ప్రో, పీ 40 ప్రో ప్లస్ మోడల్ ఫోన్ల డిస్ ప్లే నాలుగు ఎడ్జిల్లో కర్వ్ తిరిగి ఉంటుంది. టాప్ ఆఫ్ లెఫ్ట్ కార్నర్ లో న్యూ హోల్ పంచ్ డిజైన్ ఉంది. ఇది ఇటీవల విపణిలోకి విడుదలైన శామ్ సంగ్ ఫోన్లను పోలి ఉంటుంది. 

పీ 40 ఫోన్ 6.1 అంగుళాల డిస్ ప్లే, పీ 40 ప్రో, పీ40 ప్రో ప్లస్ మోడల్ ఫోన్లు 6.58 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటాయి. డిస్ ప్లే 90హెచ్ జడ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఐఫోన్ 11 ప్రో మాదిరిగా హువావే పీ 40 ప్రో ప్లస్ మోడల్ కారు బ్లాక్, వైట్ మ్యాట్ సిరామిక్ బాక్ రంగులో పొందవచ్చు. సాధారణంగానే హువావే పలు రకాల రంగుల ఆప్షన్లలో తన ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది. 

హువావే సొంత వ్యవస్థతో కూడిన చిప్‌ కిరిన్ 990 మోడల్ 5జీ నెట్ వర్క్క్ లోనూ పని చేస్తుంది. గతేడాది పీ సిరీస్ ఫోన్లతో పోలిస్తే సీపీయూ 23 శాతం వేగంగా, జీపీయూ 39 శాతం వేగంగా పని చేస్తాయి.  పీ 40 ప్రో ప్లస్ నాలుగు డిఫరెంట్ కెమెరా మాడ్యూల్స్, టైం ఆఫ్ సెన్సర్ - అల్ట్రా వైడ్ లెన్స్ (18 ఎంఎం), నార్మల్ లెన్స్ (23 ఎంఎం), 3 xలెన్స్ (80ఎంఎం), సూపర్ పెరిస్కోప్ లెన్స్ విత్ 10ఎక్స్ ఆప్టికల్ జూమ్ కలిగి ఉంటుంది.