Asianet News TeluguAsianet News Telugu

Sims On Your Name: మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాలా.. అయితే ఈజీగా చెక్ చేసుకోండి..!

కొందరూ తరుచుగా మెుబైల్ నెంబర్‌లను మారుస్తుంటారు. మళ్లీ కొత్తవి తీసుకొని వాడుతుంటారు. అయితే తాజాగా సిమ్ కార్డులపై పరిమితి విధించింది టెలీకమ్యూనికేషన్ శాఖ. అయితే ఒకరి పేరు మీద ఎన్ని నెంబర్ ఉన్నాయో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ముఖ్యం.
 

How To Check How Many Sim On Your Name
Author
Hyderabad, First Published Jun 27, 2022, 1:54 PM IST

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందుతున్న కొద్ది సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోయాయి. కాబట్టి టెక్నాలజీ వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటే ముందుగా మీ ఫోన్, సిమ్ కార్డ్, బ్యాంక్ వివరాలు తదితరాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఎక్కువగా జరిగే సైబర్ మోసాలు ఫోన్ నంబర్‌ అధారంగా జరుగుతుంటాయి. ఫోన్ నంబర్స్‌ను మార్చడం ద్వారా లేదా ఓకే గుర్తింపు కార్డుపై బహుళ సిమ్ కార్డ్‌లను తీసుకుని నేరాలకు పాల్పడుతుంటారు. ఈ నేపథ్యంలో ఎవరైనా మీ ఆధార్‌తో మరొక నంబర్‌ని యాక్టివేట్ చేశారని అనుమానించినట్లయితే, మీరు సులభంగా చెక్ చేయవచ్చు. మోసాలను నివరించడానికి మీ ఆధార్‌పై ఎన్ని సిమ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు.

మీ ఆధార్ కార్డ్‌తో ఎన్ని మొబైల్ నంబర్‌లు రిజిస్టర్ చేయబడి ఉన్నాయో ఆధార్ కార్డ్‌లోని యాక్టివ్ నంబర్‌ ద్వారా తనిఖీ చేయవచ్చు . దీని కోసం ముందుగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) పోర్టల్ ఓపెన్ చేసి మీ ఆధార్ కార్డ్‌పై ఎన్ని సిమ్ కార్డ్‌లు రిజిస్టర్ అయ్యాయో తెలుసుకోవచ్చు.

ఆధార్ కార్డ్‌తో సిమ్ కార్డ్‌ను చెక్ చేసుకునే విధానం

- ముందుగా https://www.tafcop.dgtelecom.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లండి.

- అక్కడ మొబైల్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, OTP వస్తుంది, దాన్ని అక్కడ ఎంటర్ చేయండి.

- ఆ తర్వాత ఒక జాబితా కనిపిస్తుంది, అందులో మీ ఆదార్‌తో లింక్ చేయబడిన SIM కార్డ్ వివరాలు ఉంటాయి.

- ఈ జాబితాలో ఉపయోగించని నంబర్‌ ఏదైనా ఉంటే బ్లాక్ చేయవచ్చు.

- మీ పేరుతో నంబర్ తీసుకున్న వ్యక్తిపై ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు.

-  అలాగే ఈ పిర్యాదుకు సంబంధించి ట్రాకింగ్ ID ఇవ్వబడుతుంది. దీన్ని బట్టి ఎవరైతే చోరీ చేసి ఆ నంబర్‌ను యాక్టివేట్ చేశారో, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలిసిపోతుంది.

ఒక ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డ్‌లను పొందగలరు..?

DoT నిబంధనల ప్రకారం, ఒక ఆధార్ కార్డ్ నుండి 9 మొబైల్ నంబర్లు మాత్రమే జారీ చేయబడతాయి. మీ ఆధార్ కార్డ్ నుండి ఎన్ని నంబర్లు యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసుకోవాలంటే, పై పద్ధతిని ఉపయోగించవచ్చు. ఒకవేళ మీరు SIM కార్డ్‌ని ఉపయోగించకుంటే, ఆధార్ కార్డ్ నుండి ఆ ఆధార్‌ను తీసివేయాలనుకుంటే DoT సులభంగా నిలిపివేయవచ్చు.
 

Follow Us:
Download App:
  • android
  • ios