రూ.1కే హానర్ స్మార్ట్ ఫోన్.. బంపర్ ఆఫర్
హానర్ భారతీయ వినియోగదారులకోసం ఫ్లాష్ సేల్ ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 11న ఈ ప్రత్యేకంగా ఈ విక్రయాన్ని చేపట్టబోతోంది. ఈ సేల్‌లో హానర్ 9ఎన్ (3 జీబీ, 32 జీబీ స్టోరేజ్) స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఒక రూపాయికే అందించనుంది.
చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ హానర్.. భారత్ లోని మొబైల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. హానర్ నుంచి హానర్9ఎన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. కాగా.. ఈ ఫోన్ ని కేవలం రూ.1కే అందించాలనుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది.
హానర్ భారతీయ వినియోగదారులకోసం ఫ్లాష్ సేల్ ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 11న ఈ ప్రత్యేకంగా ఈ విక్రయాన్ని చేపట్టబోతోంది. ఈ సేల్‌లో హానర్ 9ఎన్ (3 జీబీ, 32 జీబీ స్టోరేజ్) స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఒక రూపాయికే అందించనుంది. హానర్ 9ఎన్ 3 జీబీ, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర. రూ. 11,999గా ఉంది.
సెప్టెంబర్ 11 న ఉదయం 11 గంటల 45 నిమిషాలకు హానర్ వెబ్‌సైట్ ద్వారా ఈ ఫ్లాష్ సేల్ నిర్వహిస్తుంది. అయితే ఇది కేవలం కంపెనీ వెబ్‌సైట్ అలాగే స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. లిమిటెడ్ డివైస్‌లపై అందిస్తున్న ఈ ఆఫర్‌ను దక్కించుకోవాలంటే హానర్ ఆన్‌లైన్ స్టోర్‌లో రిజిస్టర్ చేసుకొని వ్యకిగత వివరాలను నమోదు చేయాలి. అలాగే ఆన్‌లైన్ చెల్లింపులకు మాత్రమే అనుమతి. దీంతోపాటు ఈ ఫ్లాష్ సేల్ ద్వారా హానర్ 7ఎస్, హానర్ 9ఎన్, హానర్ ప్లే ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.