ఒకనాడు ఫీచర్ ఫోన్ల సామ్రాజ్యాన్ని ఏలిన నోకియా.. దాని ఉత్పత్తి దారు హెచ్ఎండీ గ్లోబల్ మరోసారి మొబైల్ ఫోన్ల సామ్రాజ్యంలో పట్టు సాధించాలని భావిస్తోంది. రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌కు పోటీగా నోకియా 220 4జీ, నోకియా 105 అనే పేరుతో రెండు రీఫ్రెష్డ్ ఫోన్లను విపణిలో ఆవిష్కరించింది.
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగినా ఫీచర్ ఫోన్లకు ఉన్న ఆదరణ మాత్రం కొనసాగుతూనే ఉంది. వృద్ధులు, ఫీచర్ ఫోన్ వాడాలని కోరుకునే వారు వీటిపైనే మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో నోకియా బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు ఉత్పత్తి చేస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ వినియోగదారులకు ఆకట్టుకునేందుకు రెండు ఆకర్షణీయమైన ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది.
హెచ్ఎండీ గ్లోబల్ ఆవిష్కరించిన రెండు ఫోన్లలో నోకియా 220 4జీ ఒకటి కాగా.. ఇంకోటి నోకియా 105. ఈ రెండూ నోకియా పాత మోడళ్లకు అప్‌డేటెడ్ వెర్షన్. వీటి ధరలను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. జియో 4జీ ఫీచర్ ఫోన్‌కు పోటీగా తీసుకొచ్చిన ఈ ఫోన్లను అంతకంటే తక్కువ ధరకే అందించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
పాత నోకియా 220తో పోలిస్తే కొత్త ఫోన్‌లో పలు మార్పులు చేసింది హెచ్ఎండీ గ్లోబల్. ముఖ్యంగా డిజైన్ విషయంలో చాలా మార్పులు చేసింది. పాలీకార్బొనేట్ బాడీతో, ఒంపులు తిరిగిన అంచులతో ఈ ఫోన్ వస్తోంది. 2.4 అంగుళాల క్యూక్యూవీజీఏ డిస్‌ప్లేను ఈ ఫోన్లో అమర్చారు. ఫీచర్ ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
నోకియా 220 4జీ ఫోన్‌లో 16ఎంబీ ర్యామ్ తోపాటు 24 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. వెనుకవైపు ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన వీజీఏ కెమెరా అమర్చారు. దీంతో పాటు ఎంపీ3 ప్లేయర్, ఎఫ్‌ఎం రేడియో, బ్లూటూత్ 4.2, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఇందులో ఉన్నాయి. డ్యూయల్ సిమ్‌తో పాటు, సింగిల్ సిమ్ వేరియంట్‌ను కూడా హెచ్‌ఎండీ తీసుకొస్తోంది.
1200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్న నోకియా 220 4జత ఫోన్‌లో మైక్రో యూఎస్‌బీ పోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ 4జీ వీవోఎల్‌టీఈ కాల్స్‌కు, 3జీకి కూడా సపోర్ట్ చేయదని కంపెనీ స్పష్టంచేసింది. కేవలం 900, 1800 2జీ ఈయూ బ్యాండ్స్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇందులో ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా ఓపెరా మినీ బ్రౌజర్, ఫేస్‌బుక్, ట్విటర్, ఆధునికీకరించిన స్నేక్ గేమ్ ఉంటాయి.
ఇక నోకియా 105 ఫోన్ కూడా పాలీకార్బొనేట్ బాడీతో వస్తోంది. కింద పడినా పెద్దగా నష్టం జరగకుండా దీన్ని రూపొందించారు. ఇందులో 1.77 అంగుళాల క్యూక్యూవీజీఏ డిస్‌ప్లే అమర్చారు. 4ఎంబీ ర్యామ్‌తోపాటు 4 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజీ మనకు లభిస్తుంది. ఎఫ్‌ఎం, 3.5 అంగుళాల ఆడియో జాక్, ఫ్లాష్‌లైట్, 800 ఎంఏహెచ్ బ్యాటరీ, మైక్రో యూఎస్‌బీ పోర్ట్ ఉంటాయి. ఈ రెండు మోడళ్లూ బ్లూ, పింక్, బ్లాక్ కలర్స్‌లో లభ్యం కానున్నాయి.
