Asianet News TeluguAsianet News Telugu

జియో ఫీచర్ ఫోన్‌కు పోటీగా వచ్చేసిన నోకియా ఫోన్లు

నోకియా బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు ఉత్పత్తి చేస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ ఆకర్షణీయమైన రెండు ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. ఇందులో ఒకటి నోకియా 220 4జీ కాగా, మరోటి నోకియా 105. పాత మోడళ్లకు అప్‌డేటెడ్ వెర్షన్ అయిన ఈ ఫోన్ల ధరను సంస్థ వెల్లడించలేదు. జియో 4జీ ఫీచర్‌ ఫోన్‌కు పోటీగా తీసుకొచ్చిన ఈ ఫోన్లను అంతకంటే తక్కువ ధరకే అందించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

HMD Global brings new Nokia 220 4G, Nokia 105 (2019) feature phones with refreshed design
Author
New Delhi, First Published Jul 26, 2019, 10:32 AM IST

న్యూఢిల్లీ: నోకియా బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు ఉత్పత్తి చేస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ ఆకర్షణీయమైన రెండు ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. ఇందులో ఒకటి నోకియా 220 4జీ కాగా, మరోటి నోకియా 105. పాత మోడళ్లకు అప్‌డేటెడ్ వెర్షన్ అయిన ఈ ఫోన్ల ధరను సంస్థ వెల్లడించలేదు. జియో 4జీ ఫీచర్‌ ఫోన్‌కు పోటీగా తీసుకొచ్చిన ఈ ఫోన్లను అంతకంటే తక్కువ ధరకే అందించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
 
నోకియా 105, నోకియా 220 4జీ స్పెసిఫికేషన్లు: నోకియా 105లో 1.77 అంగుళాల క్యూక్యూవీజీఏ స్క్రీన్, సిరీస్ 30+ ఓఎస్, మైక్రో యూఎస్‌బీ 1.1 పోర్ట్, 2జీ కనెక్టివిటీ, ఎఫ్ఎం రేడియో, 800 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్ వంటి ఫీచర్లు ఉండగా, నోకియా 220 4జీలో 2.4 అంగుళాల క్యూక్యూవీజీఏ స్క్రీన్, ఫీచర్ ఓఎస్, మైక్రో యూఎస్‌బీ 2.0, నానో సిమ్ కార్డు స్లాట్ (డ్యూయల్), 4జీ, బ్లూటూత్ 4.2, రియర్ వీజేఏ కెమెరా, 1200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎఫ్ఎం తదితర ఫీచర్లు ఉన్నాయి.


నోకియా నుంచి రెండు కొత్త ఫీచర్‌ ఫోన్లు
స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగినా ఫీచర్‌ ఫోన్లకు ఉన్న ఆదరణ మాత్రం కొనసాగుతూనే ఉంది. వృద్ధులు, చిన్న ఫోన్‌ వాడాలని కోరుకునే వారు వీటిపైనే మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో నోకియా ఫోన్లు తయారు చేసే హెఎండీ గ్లోబల్‌ రెండు ఫీచర్‌ ఫోన్లను తీసుకొచ్చింది. ఒకటి నోకియా 220 4జీ కాగా.. ఇంకోటి నోకియా 105. ఈ రెండూ నోకియా పాత మోడళ్లకు అప్‌డేటెడ్‌ వెర్షన్‌. వీటి ధరలను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. జియో ఫోన్‌కు పోటీగా ఈ ఫోన్లను తీసుకొస్తోంది. జియో ఫోన్‌ నుంచి ఉన్న పోటీ దృష్ట్యా తక్కువ ధరకే వీటిని విక్రయించాలని హెచ్‌ఎండీ గ్లోబల్‌ యోచిస్తోందట.

నోకియా 220 4జీ స్పెక్స్‌..
పాత నోకియా 220తో పోలిస్తే కొత్త ఫోన్‌లో పలు మార్పులు చేసింది హెచ్‌ఎండీ గ్లోబల్‌. ముఖ్యంగా డిజైన్‌ విషయంలో చాలా మార్పులు చేసింది. పాలీకార్బొనేట్‌ బాడీతో, ఒంపులు తిరిగిన అంచులతో ఈ ఫోన్‌ వస్తోంది. 2.4 అంగుళాల QQVGA డిస్‌ప్లేను ఈ ఫోన్లో అమర్చారు. ఫీచర్‌ ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇందులో 16ఎంబీ ర్యామ్‌, 24 ఎంబీ ఇంటర్నల్‌ స్టోరేజీ ఉంటుంది. వెనుకవైపు ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన వీజీఏ కెమెరా అమర్చారు. దీంతో పాటు ఎంపీ3 ప్లేయర్‌, ఎఫ్‌ఎం రేడియో, బ్లూటూత్‌ 4.2, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌ ఇందులో ఉన్నాయి. డ్యూయల్‌ సిమ్‌తో పాటు, సింగిల్‌ సిమ్‌ వేరియంట్‌ను కూడా హెచ్‌ఎండీ తీసుకొస్తోంది. 1200 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌లో మైక్రో యూఎస్‌బీ పోర్ట్‌ను అందిస్తున్నారు. అయితే, ఈ ఫోన్‌ 4జీ వీవోఎల్‌టీఈ కాల్స్‌కు, 3జీకి కూడా సపోర్ట్‌ చేయదని కంపెనీ స్పష్టంచేసింది. కేవలం 900, 1800 2జీ ఈయూ బ్యాండ్స్‌కు మాత్రమే సపోర్ట్‌ చేస్తుంది. ఇందులో ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా ఓపెరా మినీ బ్రౌజర్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఆధునికీకరించిన స్నేక్‌ గేమ్‌ ఉంటాయి.

నోకియా 105 స్పెక్స్‌..
ఇక నోకియా 105 విషయానికొస్తే ఇది కూడా పాలీకార్బొనేట్‌ బాడీతో వస్తోంది. కింద పడినా పెద్దగా నష్టం జరగకుండా దీన్ని రూపొందించారు. ఇందులో 1.77 అంగుళాల QQVGA డిస్‌ప్లే అమర్చారు. 4ఎంబీ ర్యామ్‌, 4 ఎంబీ ఇంటర్నల్‌ స్టోరేజీ మనకు లభిస్తుంది. ఎఫ్‌ఎం, 3.5 అంగుళాల ఆడియో జాక్‌, ఫ్లాష్‌లైట్‌, 800 ఎంఏహెచ్‌ బ్యాటరీ, మైక్రో యూఎస్‌బీ పోర్ట్‌ ఉంటాయి. ఈ రెండు మోడళ్లూ బ్లూ, పింక్‌, బ్లాక్‌ కలర్స్‌లో లభ్యం కానున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios