కొత్తగా తీసుకొచ్చిన అన్యూవల్ న్యూ ఇయర్  ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2.5 GB డేటాను అందిస్తుంది. డేటా అయిపోయిన తర్వాత 64 Kbpsతో ఆన్ లిమిటెడ్ డేటాను పొందుతారు. అది కూడా 5G డేటాను కూడా.

రిలయన్స్ జియో భారతదేశంలోని యూజర్ల కోసం కొత్త హ్యాపీ న్యూ ఇయర్ 2024 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ అన్యువల్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ఇండియాలోని ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా అందించే ప్లాన్‌లతో పోటీగా నిలుస్త్తుంది. ముఖ్యంగా, కొత్త సంవత్సర ప్లాన్‌తో 365 రోజుల వాలిడిటికి బదులుగా Jio 389 రోజుల ఎక్కువ వాలిడిటి అందిస్తోంది. 

ఈ జియో హ్యాపీ న్యూ ఇయర్ 2024 ప్లాన్ ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వార్షిక ప్లాన్‌లతో పోల్చి చుస్తే: 

జియో హ్యాపీ న్యూ ఇయర్ 2024 ప్లాన్

ధర: రూ. 2,999 
కొత్తగా తీసుకొచ్చిన అన్యూవల్ న్యూ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2.5 GB డేటాను అందిస్తుంది. డేటా అయిపోయిన తర్వాత 64 Kbpsతో ఆన్ లిమిటెడ్ డేటాను పొందుతారు. అది కూడా 5G డేటాను కూడా. ఈ ప్యాక్ ప్రస్తుతం భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు పరిమితం చేయబడింది. దీనితో పాటు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఉచిత SMSలు, JioTV, JioCinema అండ్ JioCloudతో సహా Jio యాప్‌లకు యాక్సెస్‌ పొందుతారు.

వాలిడిటి పరంగా చూస్తే ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. అయితే సబ్‌స్క్రైబర్‌లు 24 రోజుల వాలిడిటీ వోచర్‌ను పొందుతారు, దీనితో వాలిడిటి 389 రోజుల వరకు వస్తుంది.


ఎయిర్‌టెల్ అన్యువల్ రీఛార్జ్ ప్లాన్ 

ధర: రూ. 3,350

ఈ Airtel ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటితో రోజుకు 2.5 GB డేటాను అందిస్తుంది. ఆన్ లిమిటెడ్ కాలింగ్ ఇంకా రోజుకు 100 SMSలను అందిస్తుంది. సబ్‌స్క్రైబర్‌లు వారి ప్రాంతంలో 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉంటే ఆన్ లిమిటెడ్ 5G డేటాను కూడా పొందుతారు. దీనితో పాటుగా డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్‌కు ఒక సంవత్సరం సబ్‌స్క్రిప్షన్‌ పొందుతారు, దీని ధర రూ. 500, 24/7 సర్కిల్, 3 నెలల పాటు ఉచిత హెలోట్యూన్స్ ఇంకా వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ కూడా.

Vi ఆన్యూవల్ రీఛార్జ్ ప్లాన్

ధర: రూ. 3,099 

ఈ Vodafone-Idea వార్షిక రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల వాలిడిటి, రోజుకు 2 GB డేటాను అందిస్తుంది. ఇతర అన్యువల్ ప్లాన్‌ల లాగానే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఆన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. దీనితో పాటు సబ్‌స్క్రైబర్‌లు బింగే ఆల్ నైట్ (12 AM నుండి 6 AM వరకు ఆన్ లిమిటెడ్ డేటా), వీకెండ్ డేటా రోల్‌ఓవర్, Vi సినిమాస్ అండ్ టీవీ, నెలకు 2GB డేటా బ్యాకప్‌కు యాక్సెస్ పొందుతారు.

మొత్తంమీద, Jio అన్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా 389 రోజుల వాలిడిటిటీ అందిస్తుంది. అయితే డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్‌కు ఆక్సెస్ పొందాలనుకుంటే ఎయిర్‌టెల్ ప్లాన్‌కు వెళ్లవచ్చు. మీకు ఎక్కువ డేటా అవసరమైతే మీరు Vi ప్లాన్‌ని కూడా ఎంచుకోవచ్చు.