స్టిచ్చింగ్ నేర్చుకుంటున్న మెటా సీఈఓ.. కూతుళ్లకు డ్రెసుల డిజైన్.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..
మార్క్ జుకర్‌బర్గ్ తన భార్య ప్రిస్సిల్లా చాన్ గత ఏడాది సెప్టెంబర్‌లో సోషల్ మీడియా పోస్ట్ ద్వారా మూడవ బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించారు. ఈ జంటకి ఇప్పటికే మాక్సిమా అండ్ ఆగస్టు అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కొత్త క్రియేటివ్ హాబీని తీసుకున్నట్లు తెలుస్తోంది. టెక్ టైకూన్ మార్క్ జుకర్‌బర్గ్ గత నెల నుండి కుట్టు నేర్చుకుని డిజైనింగ్ అండ్ 3డి ప్రింటింగ్ డ్రెస్‌లను ప్రారంభించాడు. తాజాగా మార్క్ జుకర్‌బర్గ్ తన కూతురు కోసం రూపొందించిన 3D-ప్రింటెడ్ డ్రెస్ ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
మార్క్ జుకర్‌బర్గ్ తన భార్య ప్రిస్సిల్లా చాన్ గత ఏడాది సెప్టెంబర్‌లో సోషల్ మీడియా పోస్ట్ ద్వారా మూడవ బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించారు. ఈ జంటకి ఇప్పటికే మాక్సిమా అండ్ ఆగస్టు అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తన క్రియేషన్స్ ఫోటోలను షేర్ చేసారు.
“నాకు బిల్డింగ్ థింగ్స్ అంటే చాలా ఇష్టం, ఇటీవల మా కూతురుతో కలిసి 3డి ప్రింటింగ్ డ్రెస్‌లను డిజైన్ చేయడం ప్రారంభించాను” అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
ఈ పోస్ట్‌కి 219k పైగా లైక్‌లు, కామెంట్స్ వచ్చాయి. మార్క్ జుకర్‌బర్గ్ కొత్త అభిరుచి గురించి అతని ఫాలోవర్స్ ఎంతో ఆశ్చర్యపోయారు. అయితే చాలా మంది అతని ప్రయత్నాలను మెచ్చుకుంటూ కామెంట్ చేసారు.
మార్క్ జుకర్‌బర్గ్ అండ్ ప్రిస్సిల్లా చాన్ 2015లో మొదటి బిడ్డ మాక్సిమాకి జన్మనివ్వగా, 2017లో రెండవ సంతానం ఆగస్టు పుట్టినట్లు ప్రకటించారు.
సోషల్ మీడియాలో ఒక యూజర్ ''ఇది చాలా బాగుంది,'' అంటూ కామెంట్ చేయగా మరొకరు ''ఈ ప్రాజెక్ట్‌లో మీతో గడిపే సమయాన్ని వారు భవిష్యత్తులో ఎప్పటికీ గుర్తుంచుకుంటారు!'' అని రిప్లై చేసారు.
త్రీడీ ప్రింటింగ్‌తో తయారు చేసిన సూట్ ఫొటోను కూడా గతే ఏడాది విడుదల చేశాడు. ''మాక్స్ సూట్ మొదటి భాగాన్ని 3D ప్రింటింగ్ తో పూర్తి చేసాను'' అని ఫోటో షేర్ చేసారు.
మార్క్ జుకర్‌బర్గ్ అతని భార్య హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొందిన తర్వాత కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను అభ్యసించారు.
హార్వర్డ్ యూనివర్శిటీలో ఒక పార్టీలో వీరిద్దరూ కలుసుకున్న తర్వాత, ఈ జంట 2003లో డేటింగ్ ప్రారంభించారు. మే 19, 2012న ఒకటయ్యారు.