వాషింగ్టన్: ఈ ఏడాది అమెరికాలో పని చేసే ఐటీ నిపుణులకు జారీ హెచ్1 బీ వీసాల కోసం ఆయా సంస్థలు, ఉద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులు భారీగా తిరస్కరణకు గురయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి హెచ్‌‌–1బీ వీసాలపై జరుగుతున్న రగడ తెలిసిందే. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఆ దేశ అధికారులు ఎక్కడికక్కడ కొత్త వీసా అప్లికేషన్లకు కోత పెడుతున్నారు. 2018–19 మూడో త్రైమాసికం‌‌‌లో కొత్త హెచ్‌‌–1బీ అప్లికేషన్లలో నాలుగో వంతు దరఖాస్తులను అమెరికా కార్యాలయం తిరస్కరించినట్లు అమెరికాకు చెందిన ఓ అధ్యయన సంస్థ తెలిపింది.

also read హెచ్ 1బీ రూల్స్ సడలించండి: ట్రంప్‌కు 60 వర్సిటీల లేఖ.. నిపుణుల కొరత వస్తుందని ఆందోళన 

ఇలా రిజక్ట్ అయిన రేటు 2015తో పోలిస్తే ఈ ఏడాది మూడు రెట్లు అధికంగా ఉందని అమెరికన్ సిటిజన్‌‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌‌ను అనాలసిస్ చేసిన నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ అమెరికన్ పాలసీ(ఎన్‌‌ఎఫ్‌‌ఏపీ) డేటాలో వెల్లడైంది. మొత్తం హెచ్‌‌–1బీ పర్మిట్ హోల్డర్లలో సుమారు 70 శాతం మంది ఇండియన్లే ఉంటున్నారు. 

అమెరికాలో ఆన్‌‌సైట్ వర్క్‌‌ కోసం ఇక్కడి ఉద్యోగులను గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలు నియమించుకుంటున్నాయి. అమెరికా సిటిజన్‌‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌‌(యూఎస్‌‌సీఐఎస్) అక్టోబర్ నుంచి సెప్టెంబర్ కాలాన్ని ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌గా పరిగణలోకి తీసుకుంటుంది.

‘హెచ్‌‌–1బీ పిటిషన్లను తిరస్కరించే రేటు పెరుగుతుంది. ఎందుకంటే కొత్త రెగ్యులేషన్స్ లేకుండానే యూఎస్‌‌సీఐఎస్ దరఖాస్తులను ఆమోదించే పాత ప్రమాణాలను మార్చింది’ అని ఎన్‌‌ఎఫ్‌‌ఏపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టార్ట్ ఆండర్సన్ చెప్పారు. 

2015లో కొత్త హెచ్‌‌–14బీ వీసా అప్లికేషన్ల తిరస్కరణ రేటు ఆరు శాతంగా ఉండేదని పేర్కొన్నారు. వీసా అప్లికేషన్లు రిజక్ట్ అయిన కంపెనీల్లో కాగ్నిజెంట్ మొదటి స్థానంలో ఉంది. ఈ కంపెనీకి చెందిన 60 శాతం అప్లికేషన్లు రిజక్ట్ అయ్యాయి. దాని తర్వాత కాప్‌‌జెమినీ, అసెంచర్, విప్రో, ఇన్ఫోసిస్‌‌లకు చెందిన హెచ్‌‌–1బీ వీసాలు ఎక్కువగా తిరస్కరణకు గురయ్యాయి.

అమెరికాలో ఆన్‌‌సైట్ వర్క్‌‌ కోసం ఉద్యోగులను అక్కడికి పంపడానికి ఐటీ కంపెనీలు ఎంతో ఒత్తిడికి గురవుతున్నాయి. దీంతో అక్కడ వ్యాపారాలు బాగా ప్రభావితమవుతున్నాయి. రిపోర్ట్ ప్రకారం2018లో టాప్ 6 ఇండియన్ సంస్థలు కేవలం 16 శాతం లేదా 2,145 హెచ్‌‌–1బీ వర్క్ పర్మిట్లే పొందాయి.

ప్రపంచంలో అతిపెద్ద ఆన్‌‌లైన్ రిటైలర్ అమెజాన్ పొందిన 2,399 వీసాలతో పోలిస్తే, ఇండియన్ సంస్థలు పొందినవి చాలా తక్కువ. ఆపిల్, వాల్‌‌మార్ట్ వంటి కంపెనీలకు చెందిన వీసా అప్లికేషన్ల తిరస్కరణ రేటులో పెద్దగా మార్పేమీ లేదని ఎన్‌‌ఎఫ్‌‌ఏపీ పేర్కొంది. 27 టాప్ టెక్నాలజీ కంపెనీలపై ఇది అనాలసిస్ చేసింది. 

also read దక్షిణాఫ్రికాలో విషాదం: స్విమ్మింగ్‌పూల్‌లో పడి చిన్నారి మృతి.. ఆలస్యంగా గుర్తింపు

వీసా అప్లికేషన్లు రిజక్ట్ అవుతుండటంతో,  టాలెంట్ ఉన్నవారిని ఆన్‌‌సైట్ వర్క్ కోసం పంపడం ఇబ్బందవుతోందని ఇమ్మిగ్రేషన్ నిపుణుల్లో ఒకరు అన్నారు. అప్లికేషన్లు ఎక్కువగా రిజక్ట్ అవడం కూడా సమస్యేనని ఇమ్మిగ్రేషన్ లా సంస్థ లాక్వెస్ట్ మేనేజింగ్ పార్టనర్ పూర్వి చోథాని చెప్పారు.

అమెరికా ఈ ఏడాదే వీసా రూల్స్​ను మార్చింది. ఇనీషియల్ కోటాలోని 65 వేల వీసాల్లోనే అమెరికాలో మాస్టర్ డిగ్రీ పొందిన వారికి 20 వేల హెచ్‌‌–1బీ వీసాలను ఇస్తోంది. అమెరికాలో మాస్టర్ డిగ్రీ పొందిన వారికి అనుకూలంగా ఈ కొత్త రూల్‌ తీసుకొచ్చారు.

వీసా కోసం అప్లికేషన్స్‌‌ సంఖ్య తగ్గిపోవడం గత రెండేళ్ల నుంచి ప్రారంభమైంది. కేర్ రేటింగ్స్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, ఇండియన్ కంపెనీలకు అప్రూవ్ అయిన వీసాల సంఖ్య గతేడాది 49 శాతం తగ్గిపోయింది ‘బై అమెరికన్, హైర్ అమెరికన్’ పేరుతో ట్రంప్ కార్యాలయం తీసుకొచ్చిన కొత్త పాలసీలు వీసా అప్లికేషన్లు పెట్టుకోవడంపై కూడా ప్రభావం చూపుతున్నాయి.