Asianet News TeluguAsianet News Telugu

భారత్ 5G పోర్టల్ లాంచ్.. క్వాంటం, IPR అండ్ 6G రీసర్చ్.. ప్రారంభించిన టెలికాం సెక్రెటరీ

క్వాంటమ్, ఐపీఆర్, 5జీ, 6జీ పరిశోధన తదితర పనులన్నింటికీ ఈ పోర్టల్ వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఉండబోతోందని నీరజ్  మిట్టల్ ఈ సందర్భంగా వివరించారు.
 

Govt launches Bharat 5G portal for Quantum, IPR & 6G research-sak
Author
First Published Jan 31, 2024, 8:41 AM IST | Last Updated Jan 31, 2024, 8:47 AM IST

 భారతదేశంలో 5G ప్రారంభించిన తర్వాత  కేంద్ర ప్రభుత్వం 6G టెక్నాలజీపై పని చేయడం ప్రారంభించింది. అయితే, ఇప్పుడు దీనితో పాటు క్వాంటం అండ్ ఐపిఆర్‌పై పరిశోధన కోసం కేంద్రం ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఈ ప్రతిపాదనల కోసం టెలికాం సెక్రటరీ నీరజ్ మిట్టల్ మంగళవారం 'భారత్ 5జీ పోర్టల్'ను ప్రారంభించారు.

క్వాంటమ్, ఐపీఆర్, 5జీ, 6జీ పరిశోధన తదితర పనులన్నింటికీ ఈ పోర్టల్ వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఉండబోతోందని నీరజ్  మిట్టల్ ఈ సందర్భంగా వివరించారు.

"భారతదేశం 5G ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనది. 6G టెక్నాలజీ  ఇప్పటికే పనిలో ఉంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. దేశం అతి తక్కువ సమయంలో స్వదేశీ 4G అండ్ 5G టెక్నాలజీని అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది." నీరజ్ మిట్టల్  అన్నారు.

"ఈ రోజు భారతదేశంలో లక్షకు పైగా స్టార్టప్‌లు ఉన్నాయి. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంకా  సహకరించడానికి ఇది ఇతర దేశాలకు గొప్ప అవకాశం. భారతదేశం నమ్మకమైన భాగస్వామి అని ఇప్పటివరకు ప్రపంచంలోని చాలా దేశాలు అనుభవించాయి. అందుకే ప్రతి ఒక్కరూ, అది 5G లేదా 6G అయినా, భారతదేశంతో కలిసి పని చేయాలనుకుంటున్నాయి." అని తెలిపారు. 

టెలికాం రంగంలో పెట్టుబడి అవకాశాలు
టెలికాం రంగంలో స్టార్టప్‌లకు భారత ప్రభుత్వం పెట్టుబడి అవకాశాన్ని కల్పిస్తోంది. "బ్రిడ్జింగ్ డ్రీమ్స్ అండ్ ఫండింగ్: లింకింగ్ వెంచర్ క్యాపిటల్" ప్రచారం ద్వారా, పెట్టుబడిదారులు స్టార్టప్‌ల భవిష్యత్తుకు కనెక్ట్ అవుతారు. దీనికి సంబంధించిన సమావేశాన్ని నీరజ్ మిట్టల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దాదాపు 26 స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios