గూగుల్ కీలక ప్రకటన.. అలాంటి యాప్‌లపై బ్యాన్.. బ్యాంకులు, టెలికాం కంపెనీలతో చేతులు..
గూగుల్ ఈరోజు MEITY అండ్ డిజిటల్ ఇండియాతో కలిసి HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, Airtel, SBI, ICICI సపోర్ట్ తో పాన్-ఇండియా, మల్టీ లాంగ్వేజ్ యూజర్ అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది.
ఇండియాలో ఆన్‌లైన్ లోన్ యాప్‌లు భారీగా వెల్లువెత్తాయి. రోజురోజుకి కొత్త కొత్త లోన్ యాప్ మార్కెట్‌లోకి వచ్చి ప్రజలను బలిదానాలు చేస్తోంది. భారతదేశంలో ఇన్‌స్టంట్ లోన్‌ల వ్యాపారం గత రెండేళ్లుగా పుంజుకుంది కానీ ఇప్పుడు లోన్ యాప్‌లపై అసలైన టైం రాబోతోంది. ఆగష్టు 25న న్యూఢిల్లీలో జరిగిన సేఫర్ విత్ గూగుల్ సెకండ్ ఎడిషన్‌లో అన్ని రకాల లోన్ యాప్‌లు భారతదేశంలో నిషేధించబడతాయని గూగుల్ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా లేని ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లు ఏవైనా Google Play స్టోర్‌లో అనుమతించబడవు. గూగుల్ ప్లాట్‌ఫారమ్‌లో ఇప్పటివరకు 2,000 ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ మొబైల్ యాప్‌లను బ్యాన్ చేసినట్లు తెలిపింది. ఈ యాప్‌లు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తూ కస్టమర్ల గోప్యతతో ఆడుకుంటున్నాయి.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో గూగుల్ భాగస్వామ్యం
ఆన్‌లైన్ పేమెంట్ సేఫ్టీ కోసం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MEITY)తో గూగుల్ ఇండియా భాగస్వామ్యాన్ని ప్రకటించింది. డిజిటల్ మోసాలకు వ్యతిరేకంగా కస్టమర్లకు అవగాహన కల్పించేందుకు గూగుల్ భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులు, టెలికాం కంపెనీలతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.
గూగుల్ ఈరోజు MEITY అండ్ డిజిటల్ ఇండియాతో కలిసి HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, Airtel, SBI, ICICI సపోర్ట్ తో పాన్-ఇండియా, మల్టీ లాంగ్వేజ్ యూజర్ అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. అత్యంత సాధారణ మోసాలు, ఫిషింగ్ దాడుల కంటే రెండు అడుగులు ముందు ఉండేందుకు ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచారం ద్వారా ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఈ ప్రచారంలో వెబ్‌సైట్‌లు, యాప్‌లు, SMS, ATMల ద్వారా జరిగే మోసాల గురించి Google పార్ట్నర్స్ ప్రజలను హెచ్చరిస్తారు.
అంతే కాకుండా, Google ఈరోజు ProtectingChildren.Google వెబ్‌సైట్‌ను మూడు భారతీయ భాషలలో ప్రారంభించింది: బెంగాలీ, హిందీ అండ్ తమిళం. ఇందులో భారతీయ NGOలు కూడా సహకరిస్తాయి. ఈ వెబ్‌సైట్ డిజిటల్ ప్రపంచంలో పిల్లలపై జరుగుతున్న దాడులు, దోపిడీ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది.
CBSE బోర్డుతో Google భాగస్వామ్యం
ఆన్‌లైన్ సేఫ్టీ కోసం Google సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)తో చేతులు కలుపుతోంది. బలమైన, సురక్షితమైన డిజిటల్ అలవాట్లను అభివృద్ధి చేయడానికి విద్యార్థులను సన్నద్ధం చేసే లక్ష్యంతో బోధకుల ప్రోగ్రామ్‌లు, వ్యక్తిగత ప్రోగ్రామ్‌లు ఉంటాయి. దీని కింద, 10వ తరగతి వరకు ఉన్న పిల్లలకు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్, అనుమానాస్పద ఇమెయిల్‌లు, అసురక్షిత సైట్‌లను నివారించడం ఇంకా ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండటానికి ఇతర మార్గాలు వంటి ఆన్‌లైన్ సేఫ్టీ ప్రాథమిక సూత్రాలు బోధించబడతాయి ఇంకా సర్టిఫికెట్లు కూడా ఇవ్వబడతాయి.