Asianet News Telugu

గూగుల్ 800 మిలియన్ డాలర్ల డొనేషన్.. ఇంకా...

 కరోనా వైరస్ (కొవిడ్-19)పై పోరులో చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు సెర్జింజన్ దిగ్గజం గూగుల్ ముందుకొచ్చింది. చిన్న, మధ్యతరహా వ్యాపారులను (ఎస్‌ఎంబీస్) ఆదుకునేందుకు, ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు, ఆరోగ్య కార్యకర్తలు కరోనాపై చేస్తున్న పోరుకు గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అండగా నిలిచారు. 

Google-parent Alphabet to donate $800 million in response to coronavirus crisis
Author
New Delhi, First Published Mar 30, 2020, 11:06 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కాలిఫోర్నియా: కరోనా వైరస్ (కొవిడ్-19)పై పోరులో చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు సెర్జింజన్ దిగ్గజం గూగుల్ ముందుకొచ్చింది. చిన్న, మధ్యతరహా వ్యాపారులను (ఎస్‌ఎంబీస్) ఆదుకునేందుకు, ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు, ఆరోగ్య కార్యకర్తలు కరోనాపై చేస్తున్న పోరుకు గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అండగా నిలిచారు. 

ఇందుకోసం 800 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5,990) కోట్లు సుందర్ పిచాయ్ ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా ప్రభుత్వ సంస్థలకు 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,872 కోట్లు) యాడ్ గ్రాంట్స్‌ను గూగుల్ అందిస్తుందని తెలిపారు.

కమ్యూనిటీ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, ఎన్జీవోలకు ప్రకటన గ్రాంట్లలో 20 మిలియన్ డాలర్లు ఇవ్వనుండగా, గూగుల్ యాడ్స్ క్రెడిట్స్‌లో 340 మిలియన్ డాలర్లు గత సంవత్సరంలో క్రియాశీలక ఖాతాలతో ఉన్న అన్ని ఎస్ఎంబీలకు అందుబాటులో ఉంచనుంది. 

చిరువ్యాపారులను ఆదుకునే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్జీవోలు, ఫైనాన్షియల్ సంస్థలకు 200 మిలియన్ డాలర్ల పెట్టబడి నిధిని ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారిపై అధ్యయనం చేసేందుకు విద్యాసంస్థలు, పరిశోధకులకు గూగుల్ క్లౌడ్‌లో 20 మిలియన్ డాలర్లను అందిస్తోంది. అలాగే, వచ్చే కొన్ని వారాల్లో 2-3 మిలియన్ల ఫేస్‌మాస్క్‌లను ఉత్పత్తి చేసేందుకు మాజిడ్ గ్లోవ్స్ అండ్ సేఫ్టీతో కలిసి గూగుల్ పనిచేస్తోంది. 

లాక్ డౌన్ వేళ గూగుల్ తన గ్రూప్ వీడియో కాల్స్ సౌకర్యం పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఇళ్లలోనే ఉన్న కోట్లాది మంది వీడియో కాల్‌లో తమకు ఇష్టమైన వారితో మాట్లాడుతున్నారు. అయితే గ్రూప్‌ వీడియో కాల్‌లో మాట్లాడేందుకు పరిమిత సంఖ్యలో మాత్రమే అవకాశం ఉంది. 

ఈ సమస్యను అధిగమించేందుకు టెక్‌ దిగ్గజం గూగుల్ సరికొత్త అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. గూగుల్‌ డ్యుయో చాట్​ యాప్​ ద్వారా ఒకేసారి 12 మందితో వీడియో కాల్​ మాట్లాడే అవకాశాన్ని కల్పించింది. దీంతో సామాజిక దూరాన్నీ ప్రోత్సహించినట్లు అవుతుందని గూగుల్ భావిస్తోంది.

Also read:జూన్ దాకా లాక్‌డౌన్?: 30% రిటైల్ బిజినెస్ మూత.. 18 లక్షల జాబ్స్ హాంఫట్!...

గూగుల్​ ప్రొడక్ట్​ మెనేజ్​మెంట్​ సీనియర్​ డైరెక్టర్​ సనాజ్​ అహారీ లెమెల్సన్​ స్పందిస్తూ.. ‘గూగుల్‌ డ్యుయో వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా తమకు ఇష్టమైన వారిని చూసేందుకు మేం సహాయం చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో వీడియో కాలింగ్ ప్రాముఖ్యాన్ని గుర్తించాం. అందుకే గ్రూప్‌ కాలింగ్ సభ్యుల పరిమితిని 8 నుంచి 12కు పెంచాం. అది తక్షణం అందుబాటులో ఉంటుంది. ఇంకా ఎన్నో ఫీచర్లు వస్తూనే ఉంటాయి’ అని తెలిపారు.

త్వరలో అందుబాటులోకి రానున్న ఫీచర్లకు సంబంధించిన వివారాలేవీ ఆయన వెల్లడించలేదు​. 12 మంది ఒకేసారి మాట్లాడటానికి ఏర్పాటు చేసిన ఈ వెసులుబాటును భవిష్యత్తులో కొనసాగించాలా లేదా అనేది పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios