గూగుల్ డూడుల్ సెలెబ్రేట్స్ నజీహా సలీమ్‌: ఇంతకీ ఆమె ఎవరు, ఈ రోజునే ఎందుకు?

గూగుల్ డూడుల్ ఆర్ట్‌వర్క్ అనేది నజీహా సలీం పెయింటింగ్ శైలికి, కళా ప్రపంచానికి ఆమె చేసిన సుదీర్ఘ సేవలకు సంబంధించిన వేడుక. పారిస్‌లో ఉన్నప్పుడు నజీహా సలీం ఫ్రెస్కో అండ్ మ్యూరల్ పెయింటింగ్‌లో నైపుణ్యం సాధించింది.

Google Doodle Celebrates Naziha Salim: Who is She and Why Today?

నేడు అంటే శనివారం ఏప్రిల్ 23న పెయింటర్, ప్రొఫెసర్ అండ్ అత్యంత ప్రభావవంతమైన కళాకారులలో ఒకరైన నజీహా సలీమ్‌ను గూగుల్ డూడుల్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటుంది. ఆమె పైంటింగ్స్ ఎక్కువగా గ్రామీణ ఇరాకీ మహిళలు, రైతు జీవితాన్ని స్పష్టమైన రంగులతో పెయింటింగ్ ద్వారా వర్ణిస్తుంది.

టర్కీలోని ఇరాకీ కళాకారుల కుటుంబంలో జన్మించిన నజీహా సలీం తండ్రి చిత్రకారుడు, ఆమె తల్లి ఎంబ్రాయిడరీ ఆర్టిస్ట్స్. గూగుల్ ప్రకారం, ఇరాక్  అత్యంత ప్రభావవంతమైన శిల్పులలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడుతున్న జవాద్‌తో సహా ఆమె ముగ్గురు సోదరులు ఆర్ట్స్ లో పనిచేశారు. "చిన్న వయస్సు నుండి ఆమె తన స్వంత పైంటింగ్స్ చేయడంతో ఆనందించింది."

ప్రారంభ రోజుల్లో
నజీహా సలీం బాగ్దాద్ ఫైన్ ఆర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి అక్కడ ఆమె పెయింటింగ్‌ను అభ్యసించి డిస్టింక్షన్‌తో పట్టభద్రురాలైంది. ఆమె కష్టపడి పని చేయడం, కళ పట్ల ఉన్న ఆమె అభిరుచి కారణంగా పారిస్‌లోని ఎకోల్ నేషనల్ సుపీరియూర్ డెస్ బ్యూక్స్-ఆర్ట్స్‌లో విద్యను కొనసాగించడానికి స్కాలర్‌షిప్ పొందిన మొదటి మహిళల్లో ఆమె ఒకరు.

పారిస్‌లో ఉన్నప్పుడు నజీహా సలీం ఫ్రెస్కో అండ్ మ్యూరల్ పెయింటింగ్‌లో నైపుణ్యం సాధించింది. గ్రాడ్యుయేషన్ తర్వాత, ఆమె ఆర్ట్స్ అండ్ కల్చర్ లో  విదేశాలలో చాలా సంవత్సరాలు గడిపింది.

ఇరాక్ ఆర్ట్స్ కమ్యూనిటీలో యాక్టివ్
నజీహా సలీం చివరికి బాగ్దాద్‌కు తిరిగి వచ్చి ఫైన్ ఆర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసి పదవీ విరమణ వరకు బోధించేది. ఆమె ఇరాక్ ఆర్ట్స్ కమ్యూనిటీలో ఆక్టివ్ గా కూడా ఉంది ఇంకా విదేశాలలో చదువుకునే, యూరోపియన్ ఆర్ట్ టెక్నిక్స్ ని ఇరాకీ అస్థిటిక్ లో చేర్చే కళాకారుల సంఘం అయిన అల్-రువ్వాద్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు.

గూగుల్ డూడుల్ ఈరోజు ఎందుకు జరుపుకుంటుంది?
షార్జా ఆర్ట్ మ్యూజియం అండ్ మోడరన్ ఆర్ట్ ఇరాకీ ఆర్కైవ్‌లో నజిహా సలీం  ఆర్ట్ వర్క్స్  ప్రదర్శించబడింది.

"పెయింటింగ్ బ్రష్‌ల నుండి ఆమె సృష్టించిన మ్యాజిక్‌ను అక్కడ మీరు చూడవచ్చు. నేటి డూడుల్ ఆర్ట్‌వర్క్ సలీమ్ పెయింటింగ్ స్టైల్‌కు గుర్తుగా ఇంకా కళా ప్రపంచానికి ఆమె చేసిన సుదీర్ఘ సేవలకు వేడుకగా ఉంది!

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios