ప్రీపెయిడ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ ! ఇప్పుడు కొత్త సిమ్ సర్వీస్...
ఈసిమ్(esim) దీని పూర్తి అర్ధం ఎంబెడెడ్ సిమ్. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఈ-సిమ్‌ని ఇన్‌సర్ట్ చేయడం అనేది ఫోన్‌లోకి సిమ్ కార్డ్ చిప్‌ను పర్మనెంట్ గా ఫిక్స్ చేయడం.
ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం వోడాఫోన్ ఐడియా కొత్త సిమ్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇంతకుముందు, వోడాఫోన్ ఐడియా ఇ-సిమ్ సేవలు పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఐఫోన్‌లతో సహా ప్రముఖ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇ-సిమ్ సౌకర్యం ఉంది.
ఇ-సిమ్ అంటే పూర్తి అర్ధం ఎంబెడెడ్ సిమ్. దిని ప్రత్యేకత ఏమిటంటే, ఈ-సిమ్‌ని ఇన్‌సర్ట్ చేయడం అంటే ఫోన్‌లోనే సిమ్ కార్డ్ చిప్‌ని శాశ్వతంగా ఇన్‌సర్ట్ చేయడం.. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల సహాయంతో ఇ-సిమ్ యాక్టివేట్ అవుతుంది.
iPhone వంటి కొన్ని ఫోన్‌లు ఒక SIM కార్డ్‌ని మాత్రమే ఉపయోగించగలవు. అయితే దానితో పాటు ఇ-సిమ్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. డ్యూయల్ కనెక్టివిటీని ఉపయోగించడానికి అలాంటి ఫోన్‌లకు ఇ-సిమ్ యాక్టివేషన్ అవసరమని గమనించండి.
Vodafone Idea e-SIMని ఎలా యాక్టివేట్ చేయాలి ప్రస్తుత కస్టమర్‌లు 'eSIM రిజిస్టర్డ్ ఇమెయిల్ ID'తో 199కి SMS పంపాలి. వెరిఫికేషన్ తర్వాత eSIM ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ కన్ఫర్మ్ చేయడానికి 15 నిమిషాల్లో 'ESIMY' అని రిప్లయ్ ఇవ్వండి.
QR కోడ్‌ని సెట్టింగ్‌లు > మొబైల్ డేటా > యాడ్ డేటా ప్లాన్ ద్వారా స్కాన్ చేయాలి. సెకండరీ సిమ్‌ని కూడా లేబుల్ చేయవచ్చు. డిఫాల్ట్ లైన్ (ప్రైమరీ/సెకండరీ) ఎంచుకోవడం ద్వారా యాక్టివేషన్ పూర్తి చేయవచ్చు. యాక్టివేషన్ చేయడానికి 30 నిమిషాలు పడుతుంది. కొత్త కస్టమర్‌లు ID ప్రూఫ్ తో సమీపంలోని విస్టోర్‌ను సందర్శించాలి.