భారతదేశంలో నిషేదించబడిన  గేరీన ఫ్రీ ఫైర్ పై  వార్తలు వెలువడడంతో  గేమర్స్ షాక్ గురయ్యారు. అయితే ఇందుకు బి‌జి‌ఎం‌ఐ, పబ్-జజి, కాల్ ఆఫ్ డ్యూటీ  వంటి ప్రత్యామ్నాయా గేమ్ లు  ప్లేస్టోర్ లో  అందుబాటులో ఉన్నాయి.

డిజిటల్ సర్జికల్ స్ట్రైక్ ద్వారా తాజాగా 54 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిషేధించిన యాప్‌ల జాబితాలో గేరీన ఫ్రీ ఫైర్ (Garena Free Fire), యాప్ లాక్ (AppLock) వంటి ప్రముఖ యాప్‌ల పేర్లు చేర్చబడ్డాయి. నిషేధం తర్వాత ఈ యాప్‌లు ఆపిల్ (apple)యాప్ స్టోర్ అండ్ గూగుల్ (Google) ప్లే-స్టోర్ నుండి తొలగించబడ్డాయి. మీరు ఈ నిషేధంతో విచారంగా ఉంటే, ఈ వార్త మీకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. అదేంటంటే గేరీన ఫ్రీ ఫైర్ లాంటి గేమింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం...

బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా 
బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా(Battlegrounds Mobile India) అనేది 2020లో నిషేధించబడిన పబ్-జి (PUBG) మొబైల్ కొత్త వెర్షన్. ఈ గేమ్ భారత ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉందని క్లెయిమ్ చేయబడింది. అలాగే 2021 యాప్ స్టోర్ అవార్డులో బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా రెండవ స్థానంలో నిలిచింది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా (BGMI)ని క్రాఫ్టన్ కంపెనీ అభివృద్ధి చేసింది.అలాగే డాటా చోరీ విషయంలో కంపెనీ చాలా కఠినంగా ఉంది. ఈ మోసాల కారణంగా ఇప్పటి వరకు లక్షల ఖాతాలు నిషేధించబడ్డాయి. అంతేకాదు ఇప్పుడు BGMI డేటా భారతీయ సర్వర్‌లలో స్టోర్ చేయబడుతుంది.

న్యూ స్టేట్ మొబైల్
న్యూ స్టేట్ మొబైల్ గేమ్‌ని కూడా క్రాఫ్టన్ రూపొందించింది. ఈ గేమ్ భారతీయ మార్కెట్లో కంపెనీకి రెండవ బ్యాటిల్ గేమ్. దీనిని పబ్-జి నిషేధం తర్వాత ప్రారంభించింది. న్యూ స్టేట్ అనేది 2051లో ప్రపంచం ఎలా ఉంటుందనే అంశం ఆధారంగా రూపొందించబడింది. మొబైల్ అండ్ పి‌సిలో కాకుండా కన్సోల్‌లలో ఈ గేమ్ ఆడవచ్చు. 

కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్
ఈ గేమ్‌ను చైనీస్ కంపెనీ టెన్సెంట్‌తో కలిసి యాక్టివిజన్ రూపొందించింది. ఈ గేమ్ భారతదేశంలో ప్రారంభించిన మొదటి వారంలోనే 100 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. మీరు భారీ గేమింగ్‌ని ఇష్టపడితే, మీరు కాల్ ఆఫ్ డ్యూటీని ప్రయత్నించవచ్చు.

ఫోర్ట్ నైట్ మొబైల్
ఫోర్ట్ నైట్ (Fortnite) మొబైల్ కూడా ఒక పాపులర్ బ్యాటిల్ గేమ్. ఫోర్ట్‌నైట్‌తో క్రాస్ ప్లాట్‌ఫారమ్ ప్లే కూడా అందుబాటులో ఉంది. దీని సహాయంతో మీరు పి‌సి లేదా కన్సోల్‌లో మీ స్నేహితులతో కూడా కలిసి ఆడవచ్చు.

పిక్సెల్ ఆన్ నౌన్
పబ్-జి మొబైల్, పిక్సెల్ ఆన్ నౌన్ బ్యాటిల్ గ్రౌండ్ రెండూ Google Play-Store నుండి 50 మిలియన్ల డౌన్‌లోడ్ చేయబడ్డాయి. ఈ గేమ్ ఇంటర్‌ఫేస్ కూడా బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాను పోలి ఉంటుంది.