కీప్యాడ్ ఫోన్ ఇష్టపడే వారి కోసం...; UPI నుండి OTT వరకు అన్ని ఫ్రీ..
ఈ ఫోన్ KaiOSలో రన్ అవుతుంది. ఇంకా ఫీచర్ ఫోన్ లాగా ఉన్నప్పటికీ జియో ఫోన్ Prima 4G వాట్సాప్, ఫేస్ బుక్ అండ్ యుట్యూబ్ వంటి అనేక అప్లికేషన్లతో వస్తుంది.
చేతిలో జియో కీప్యాడ్ ఫోన్ ఉందా..? అయితే మీరు కూడా త్వరలోనే స్మార్ట్ గా మారుతారు. కంప్యూటర్‌లకు పోటీగా ఉండే అప్‌డేట్‌లతో స్మార్ట్‌ఫోన్‌లు నేడు మార్కెట్‌లో ఉన్నాయి. అయితే ఒక్క భారతదేశంలోనే దాదాపు 25 కోట్ల మంది కీప్యాడ్ ఫోన్లను ఉపయోగిస్తున్నారని అంచనాలు చెబుతున్నాయి. వీరిని స్మార్ట్‌గా మార్చేందుకు రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన ఫీచర్ ఫోన్ జియో ఫోన్ 4G. ఇప్పుడు Jio అనేక ఫీచర్లతో కొత్త Jio Phone Prima 4Gని లాంచ్ చేసింది.
ఈ ఫోన్ KaiOSలో రన్ అవుతుంది. ఇంకా ఫీచర్ ఫోన్ లాగా ఉన్నప్పటికీ, జియో ఫోన్ Prima 4G వాట్సాప్, ఫేస్ బుక్ అండ్ యుట్యూబ్ వంటి అనేక అప్లికేషన్లతో వస్తుంది. UPI పేమెంట్స్ చేయడానికి Jio Pay యాప్‌కు సపోర్ట్ కూడా ఉంది. మీరు జియో సినిమా, జియో టీవీ, జియో సావన్ ఇంకా జియో చాట్ వంటి OTT యాప్‌లను కూడా ఆస్వాదించవచ్చు. దీనికి 23 భాషలకు సపోర్ట్ కూడా ఉంటుంది.
అలాగే ఫోన్ కి 320×240 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌తో TFT డిస్‌ప్లే ఉంది. ఫోన్ గుండ్రని అంచులతో స్టాండర్డ్ ఫీచర్ ఫోన్ డిజైన్‌ను ఇంకా వెనుక ప్యానెల్‌పై గుండ్రటి డిజైన్‌ను పొందుతారు. ఇందులో సింగిల్ రియర్ కెమెరా, 0.3MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి స్టోరేజీని 128GB వరకు పెంచుకోవచ్చు. ARM కార్టెక్స్ A53 చిప్‌సెట్, 1,800mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఫోన్ FM రేడియో, Wi-Fi, బ్లూటూత్ 5.0కి కూడా సపోర్ట్ చస్తుంది. ఒక సంవత్సరం వారంటీ కూడా అందించబడుతుంది. జియో ఫోన్ ప్రైమా 4జీ ధర రూ.2,599. దీపావళి కానుకగా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.