Asianet News TeluguAsianet News Telugu

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ : అతితక్కువ ధరకే ఐఫోన్‌.. అన్ని మోడల్స్ పై ఆఫర్‌లు ఇవే

 ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమై 30 సెప్టెంబర్ 2022 వరకు కొనసాగుతుంది. ఈ సెల్‌లో మొబైల్స్‌తో పాటు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌ఫోన్‌లు వంటి ఇతర గాడ్జెట్‌లు కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం అందిస్తుంది.

Flipkart Big Billion Days 2022: iPhone 13 will be available at lowest price know offers of all models
Author
First Published Sep 15, 2022, 11:12 AM IST

మీరు ఆపిల్ ఐఫోన్‌ను తక్కువ ధరకు కొనేందుకు బెస్ట్ డీల్ కోసం చూస్తున్నారా.. అయితే ఫ్లిప్‌కార్ట్  మీ కోసం అద్భుతవకాశాన్ని తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022లో మీరు ఐఫోన్ 13 సిరీస్‌ను  తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని ఇస్తుంది. ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 11ని ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు లిస్ట్ అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమై 30 సెప్టెంబర్ 2022 వరకు కొనసాగుతుంది. ఈ సెల్‌లో మొబైల్స్‌తో పాటు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌ఫోన్‌లు వంటి ఇతర గాడ్జెట్‌లు కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం అందిస్తుంది.

అన్ని ఐఫోన్ మోడల్‌లపై ఆఫర్‌లు
ఆపిల్ ఐఫోన్‌ 13ని రూ. 49,990 లేదా అంతకంటే తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ దీనికి సంబంధించి టీజర్‌ను కూడా విడుదల చేసింది.  ఐఫోన్‌13 ప్రొని రూ. 89,990 లేదా అంతకంటే తక్కువ ధరకు, ఐఫోన్‌13 ప్రొ మ్యాక్స్ ని రూ. 99,990 లేదా అంతకంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం ఐఫోన్ 13 ధర రూ. 69,900, ఐఫోన్ 13 ప్రో ధర రూ. 1,19,900, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,26,000. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2022లో ఐఫోన్‌ 12 మినీని రూ.39,990కి, ఐఫోన్‌ 11ని రూ.29,990కి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది, అయితే ఐఫోన్‌12 మినీ ప్రస్తుత ధర రూ.55,359, ఐఫోన్‌ 11 ధర రూ.43,990.

నథింగ్ ఫోన్ 1, గూగుల్ పిక్సెల్ 6ఏపై తగ్గింపు
కొద్ది రోజుల క్రితం నథింగ్ ఫోన్, గూగుల్ పిక్సెల్  6ఏ కూడా తక్కువ ధరకు లభిస్తున్నాయని నివేదికలు వచ్చాయి, దీని ప్రకారం నథింగ్ ఫోన్ 1ని రూ. 27,699కి కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.  నథింగ్ ఫోన్ 1 ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుత  ధర రూ. 33,999, గూగుల్ పిక్సెల్ 6ఏ ధర రూ. 43,999. 

Follow Us:
Download App:
  • android
  • ios