రాజకీయ ప్రకటనల విధానాన్ని వ్యతిరేకిస్తూ ఫేస్‌బుక్ ఉద్యోగులు ఓ లేఖపై సంతకం చేశారు. ప్రముఖ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి సేన్ ఎలిజబెత్ వారెన్‌తో సహా ఫేస్‌బుక్ ప్రకటనల విధానంపై విస్తృతంగా విమర్శలు వచ్చాయి.   

also read  ఫేస్ బుక్ స్పెషల్ ఫీచర్.. ప్రపంచమంతా అక్కడే

వందలాది మంది ఫేస్‌బుక్ ఉద్యోగులు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఇతర అధికారులకు ఒక లేఖ రాసి దానిపై సంతకం చేశారు. సోషల్ మీడియా నెట్‌వర్క్ లలో  రాజకీయ నాయకులు చెప్పే అబద్ధపు  ప్రకటనలను  తాము వ్యతిరేకిస్తున్నామని ఆ లేఖలో  పేర్కొన్నారు.


ఈ పాలసీ విధానాన్ని మార్చమని విజ్ఞప్తి చేస్తూ 250 మందికి పైగా ఫేస్‌బుక్ ఉద్యోగులు ఈ లేఖపై సంతకం చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ సోమవారం ఓ నివేదికలో తెలిపింది. ఫేస్‌బుక్  కి ఇది చాల ముప్పు అని, ఇది ఫేస్‌బుక్  యొక్క 35,000 కంటే ఎక్కువ మంది శ్రామిక శక్తిలో ఒక చిన్న భాగం.  

also read ప్రపంచంలోనే అతిచిన్న కెమెరా సెన్సార్

ఫేస్‌బుక్  స్పోక్స్ ఉమెన్  బెర్టీ థామ్సన్ మాట్లాడుతూ "తమ ఉద్యోగులు తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నట్లు కంపెనీ అభినందిస్తుంది, కాని సంస్థ "రాజకీయ ప్రసంగాన్ని సెన్సార్ చేయకుండా కట్టుబడి ఉంది." ప్రముఖ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి సేన్ ఎలిజబెత్ వారెన్‌తో సహా ఫేస్‌బుక్ ప్రకటన విధానంపై విస్తృతంగా విమర్శలు వస్తున్నాయి.