Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్ చెప్పిన ఫేస్ బుక్ సి‌ఈ‌ఓ.. లాట్స్ ఆఫ్ లవ్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్..

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ద్వారా ట్రాక్ చేసిన అత్యంత సంపన్నులలో అతని సంపద సగానికి తగ్గిపోయింది ఇంకా ఈ సంవత్సరంకి ఇప్పటివరకు $71 బిలియన్లు కోల్పోయారు.

facebook ceo Mark Zuckerberg And Priscilla Chan Expecting Baby No 3, "Lots Of Love"
Author
First Published Sep 22, 2022, 11:00 AM IST

ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ మూడోసారి తండ్రి కాబోతున్నాడు.  ఈ విషయాన్ని మార్క్ జుకర్‌బర్గ్ తన భార్య ప్రిస్సిల్లా చాన్  గర్భవతి అని  ఇన్‌స్టాగ్రామ్‌లోకి ప్రకటించారు.  లాట్స్ ఆఫ్ లవ్. వచ్చే ఏడాది మాక్స్ అండ్ ఆగస్ట్‌ కొత్త చెల్లెలిని పొందబోతున్నారని తెలుపుతున్నందుకు సంతోషంగా ఉంది అంటూ పోస్ట్ లో తెలిపారు.

ఈ జంట 2012లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలు- ఆగస్ట్ అండ్ మాక్సి. మార్క్ జుకర్‌బర్గ్ అండ్ ప్రిస్సిల్లా చాన్ కాలేజ్ ఫ్రెండ్స్, ఈ జంట 2003లో హార్వర్డ్ యూనివర్శిటీ ఫ్రాట్ పార్టీలో కలుసుకున్న తర్వాత డేటింగ్ ప్రారంభించారు. తరువాత 2012లో వివాహం చేసుకున్నారు, తాజాగా వారి 10వ వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకున్నారు.

మక్ర్ జుకర్‌బర్గ్ గతంలో అత్యంత సంపన్నులలో ఒకరు, కానీ ఈ మధ్య కాలంలో అతని నికర విలువ దెబ్బతింది. Meta Platforms Inc. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ $68.3 బిలియన్లు లేదా అతని సంపదలో 54% కోల్పోయారు.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ద్వారా ట్రాక్ చేసిన అత్యంత సంపన్నులలో అతని సంపద సగానికి తగ్గిపోయింది ఇంకా ఈ సంవత్సరంకి ఇప్పటివరకు $71 బిలియన్లు కోల్పోయారు. అతని నికర విలువ $55.9 బిలియన్లతో ప్రపంచ బిలియనీర్‌లలో 20వ స్థానంలో ఉన్నారు.

38 ఏళ్ల మార్క్ జుకర్‌బర్గ్ సెప్టెంబర్ 2021లో  కంపెనీ షేర్లు $382కి చేరుకున్నప్పుడు అతని సంపద గరిష్టంగా $142 బిలియన్లకు చేరుకుంది. నిజానికి 2004లో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ని ప్రారంభించాడు. 

తరువాత నెలలో మార్క్ జుకర్‌బర్గ్ మెటాను పరిచయం చేశారు. అలాగే కంపెనీ పేరును Facebook Inc నుండి మెటా ఫ్లాట్ ఫార్మ్స్ కి మార్చాడు.

Follow Us:
Download App:
  • android
  • ios