Asianet News TeluguAsianet News Telugu

వాట్సాప్‌ మెసేజ్ ‘బ్లూ’ టిక్స్.. 2014లోనే వినియోగం షురూ!

బ్లూటిక్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసిన వ్యక్తి మీ మెసేజ్‌ చదివాడో లేదో తెలుసుకోవాలంటే... మీరు చాటింగ్‌ చేస్తున్న వ్యక్తి బ్లూటిక్స్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసినట్లైతే.. వారికి ఓ వాయిస్‌ మెసేజ్‌ చేయండి.  ఆ వ్యక్తి మీ వాయిస్‌ రికార్డింగ్‌ విన్నట్లయితే వెంటనే బ్లూటిక్స్‌ పడిపోతాయి. 

Even Without Blue Tick You Can Know If Your Message is Read Or Not In Whatsapp
Author
New Delhi, First Published Feb 24, 2020, 1:04 PM IST

న్యూఢిల్లీ: వాట్సాప్‌లో మనం పోస్ట్‌ చేసిన మెసేజ్‌ ఎవరైనా చదివారా? లేదా? అని తెలుసుకోవటానికి ఏం చేస్తాం. మెసేజ్‌ దగ్గర బ్లూటిక్స్‌ ఉన్నాయా లేదో చెక్‌ చేసుకుంటాం.

వాట్సాప్‌లో మన మెసేజ్‌కు అవతలి వారు స్పందిస్తారా? లేదా? అన్నది పక్కనపెడితే వాళ్లు మన మెసేజ్‌ చదివారన్నది మాత్రం తెలిసిపోతుంది. ఫ్రైవసీ ఫీచర్స్‌లో భాగంగా ఎదుటి వ్యక్తి బ్లూటిక్స్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసి ఉంటేమాత్రం వాళ్లు మన మెసేజ్‌ చదివారో లేదో తెలుసుకోవటం కష్టం. 

అసలు బ్లూటిక్స్‌  ఫీచర్‌ను వాట్సాప్‌ 2014లోనే వినియోగంలోకి తెచ్చింది. బ్లూటిక్స్‌ పడ్డాయంటే ఎదుటివ్యక్తి మన మెసేజ్‌ చదివాడని అర్థం. ఆ తర్వాత వాట్సాప్‌ వన్‌టిక్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఎదుటి వ్యక్తిని మన మెసేజ్‌ చేరగానే వన్‌టిక్‌ పడుతుంది. అయితే దాన్ని తర్వాత గ్రే కలర్‌లోకి మార్చేసింది.

Also read:బీఎస్-4 క్రెట్టా సహా హ్యుండాయ్ కార్లపై ఆఫర్ల వర్షం

బ్లూటిక్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసిన వ్యక్తి మీ మెసేజ్‌ చదివాడో లేదో తెలుసుకోవాలంటే... మీరు చాటింగ్‌ చేస్తున్న వ్యక్తి బ్లూటిక్స్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసినట్లైతే.. వారికి ఓ వాయిస్‌ మెసేజ్‌ చేయండి.  ఆ వ్యక్తి మీ వాయిస్‌ రికార్డింగ్‌ విన్నట్లయితే వెంటనే బ్లూటిక్స్‌ పడిపోతాయి. 

అతడు బ్లూటిక్స్‌ ఆప్షన్‌ ఆఫ్‌ చేసినా వాయిస్‌ మెసేజ్‌ విన్నప్పుడు మాత్రం బ్లూటిక్స్‌ పడిపోతాయి. ఇది ఒకరకంగా వాట్సాప్‌లోని లోపమని చెప్పొచ్చు. గత సంవత్సరమే ఈ సాంకేతిక లోపం వెలుగులోకి వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios