ట్విటర్ కొనుగోలుకు టెస్లా సి‌ఈ‌ఓ మరో భారీ పెట్టుబడి.. 10 రోజుల్లో టెండర్ ఆఫర్‌ : రిపోర్ట్

నివేదిక ప్రకారం, మరో 10 బిలియన్ డాలర్ల రుణాన్ని సేకరించేందుకు మోర్గాన్ స్టాన్లీని ఎలోన్ మస్క్ కోరాడు.టెస్లా ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన ఎలోన్ మస్క్ అవసరమైతే తన ప్రస్తుత వాటాపై రుణం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడని, ఈ చర్య వల్ల మరిన్ని బిలియన్ల అదనపు డాలర్లను సేకరించగలదని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
 

Elon Musk To Invest 15 Billion Of His Own Money To Buy Twitter: Report

టేస్లా సి‌ఈ‌ఓ ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఇంక్‌ని పొందేందుకు తన స్వంత డబ్బులో 10 బిలియన్  డాలర్ల నుండి 15 బిలియన్ల డాలర్ల మధ్య పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని న్యూయార్క్ పోస్ట్ మంగళవారం నివేదించింది.

 నివేదిక ప్రకారం 9.1% వాటాతో Twitter రెండవ-అతిపెద్ద వాటాదారి అయిన బిలియనీర్ ఎలోన్ మస్క్ సుమారు 10 రోజుల్లో టెండర్ ఆఫర్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నాడని తెలిపింది. అయితే మరో 10 బిలియన్ల డాలర్ల రుణాన్ని సేకరించడానికి  పెట్టుబడి బ్యాంకింగ్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీని కూడా కోరాడు.

టెస్లా ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన ఎలోన్ మస్క్ అవసరమైతే తన ప్రస్తుత వాటాపై రుణం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడని, ఈ చర్య వల్ల మరిన్ని బిలియన్ల అదనపు డాలర్లను సేకరించగలదని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ట్విట్టర్ దీనిపై స్పందించెందుకు నిరాకరించింది. మరోవైపు ఎలోన్ మస్క్ నుండి  స్పందన పై టెస్లా వెంటనే స్పందించలేదు.

ఎలోన్ మస్క్ 43 బిలియన్ల డాలర్ల కొనుగోలు ఆఫర్ నుండి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి సోషల్ మీడియా సంస్థ గత వారం విముఖతను చూపించింది. చాలా ప్రైవేట్-ఈక్విటీ సంస్థలు ట్విట్టర్ కోసం ఒక ఒప్పందంలో పాల్గొనడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి, ఈ విషయం గురించి తెలిసిన వారు సోమవారం ఆ సంస్థ పేరు పెట్టకుండా చెప్పారు.


ఎలోన్ మస్క్ ఆఫర్‌ను ఛాలెంజ్ చేసే కొనుగోలును అన్వేషించడానికి టెక్నాలజీ-కేంద్రీకృత పి‌ఈ సంస్థ థామా బ్రావో గత వారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను సంప్రదించిన తర్వాత ఈ ఆసక్తి కనిపించింది. అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ ఇంక్ ఏదైనా డీల్‌కి ఫైనాన్సింగ్ అందించే మార్గాలను పరిశీలిస్తోంది అలాగే ఎలోన్ మస్క్ లేదా మరేదైనా బిడ్డర్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది అని కొన్ని నివేదికలు తెలిపాయి.

చాలా మంది పెట్టుబడిదారులు, విశ్లేషకులు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు రాబోయే రోజుల్లో ఎలోన్ మస్క్ చేసిన ఆఫర్ సరిపోదని పేర్కొంటూ ట్విటర్ బోర్డు తిరస్కరిస్తుందని భావీస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ట్రేడ్‌లో ట్విట్టర్ షేర్లు 1.6% తగ్గి 47.69 డాలర్ల వద్ద ఉన్నాయి, ఎలోన్ మస్క్ ఆఫర్ చేసిన 54.20 డాలర్ల కంటే చాలా తక్కువ.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios