మనిషి మెదడులో చిప్.. కదలలేకున్నా ఆలోచనతో చెస్, వీడియో గేమ్స్.. వైరల్ వీడియో..
ఇంటర్నెట్ లో విస్తృతంగా షేర్ చేయబడిన ఈ వీడియోలో కూడా పేషంట్ చీప్ తో అమర్చబడినట్లు చూడవచ్చు. అయితే ఈ వీడియో ఆ పేషంట్ తనను నాలాండ్ అర్బాగ్ గా పరిచయం చేసుకున్నాడు.
బిలియనీర్ అండ్ టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ బుధవారం మొదటి బ్రెయిన్ ఇంప్లాంట్ పేషంట్(patient)ని ప్రదర్శించింది. ఇప్పుడు న్యూరాలింక్ డివైజ్ ఉపయోగించి ఆలోచనల ద్వారా ఆన్ లైన్ చెస్ అండ్ వీడియో గేమ్స్ అడగలదని చూపించింది.
ఇంటర్నెట్ లో విస్తృతంగా షేర్ చేయబడిన ఈ వీడియోలో కూడా పేషంట్ చీప్ తో అమర్చబడినట్లు చూడవచ్చు. అయితే ఈ వీడియో ఆ పేషంట్ తనను నాలాండ్ అర్బాగ్ గా పరిచయం చేసుకున్నాడు. అయితే అతను కొంత కాలం క్రితం రోడ్డు ప్రమాదం కారణంగా పక్షవాతంకి గురయ్యాడు.
ఇప్పుడు అతను లాప్ టాప్ లో చెస్ ఆడుతూ ఇంకా న్యూరాలింక్ చిప్ ద్వారా మౌస్ కర్సర్ కదిలించడాని చూడవచ్చు.
"మీరు లాప్ టాప్ కర్సర్ స్క్రిన్ చుట్టూ కదులుతుండడం చూడగలిగితే అది మొత్తం నేనే, ఇది చాల బాగుంది" అంటూ లైవ్ స్ట్రీమ్ సమయంలో డిజిటల్ చెస్ ఆడుతూ అన్నారు.
మెదడు- కంప్యూటర్ ఇంటర్పేస్ ను ఉపయోగించే ప్రక్రియను అర్బాగ్ వివరిస్తూన్నట్లు కూడా వీడియోలో చూడవచ్చు.
న్యూరాలింక్ అధ్యయనంలో భాగం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆర్భాగ్ పేర్కొన్నారు.