ఎలోన్ మస్క్ ట్విట్టర్ డీల్ బ్రేక్.. కేసు నమోదు చేయ్నున్న కంపెనీ..

శుక్రవారం ట్విట్టర్‌ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు  లేఖలో తెలిపింది, ఎందుకంటే ఈ ఒప్పందంలోని ఎన్నో నిబంధనలను ట్విట్టర్ ఉల్లంఘిస్తోంది.  అలాగే ఎలోన్ మస్క్ కొంత సమాచారాన్ని పంచుకోవాలని ట్విట్టర్‌ని కోరాడు, కానీ కంపెనీ అలా చేయలేదు.
 

Elon Musk announces to end 44 dollar billion deal with twitter now company will file a case

బిలియనీర్ అండ్ టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ బృందం ట్విట్టర్‌కు లేఖ పంపింది. ఇందులో ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఇంక్‌ని కొనుగోలు చేయడానికి, దానిని ప్రైవేట్‌గా తీసుకోవడానికి $44 బిలియన్ల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు నివేదించింది. అలాగే ఈ  కొనుగోలు ఒప్పందంలో  ఉల్లంఘనలను కూడా లేఖలో ఉదహరించారు.

  ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు 
శుక్రవారం ట్విట్టర్‌ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు  లేఖలో తెలిపింది, ఎందుకంటే ఈ ఒప్పందంలోని ఎన్నో నిబంధనలను ట్విట్టర్ ఉల్లంఘిస్తోంది.  అలాగే ఎలోన్ మస్క్ కొంత సమాచారాన్ని పంచుకోవాలని ట్విట్టర్‌ని కోరాడు, కానీ కంపెనీ అలా చేయలేదు.

కొద్ది రోజుల క్రితం ఎలోన్ మస్క్ ట్విట్టర్‌లో 20 శాతం నకిలీ, స్పామ్ ఖాతాలు ఉన్నాయని పేర్కొన్నాడు, అయితే ఈ సంఖ్య ట్విట్టర్   క్లెయిమ్ చేసిన ఐదు శాతం కంటే నాలుగు రెట్లు ఎక్కువ కావచ్చు. ఇదే జరిగితే, తాను ఈ ఒప్పందాన్ని కొనసాగించనని ఎలోన్ మస్క్ చెప్పాడు. 

 కోర్టుకు వెళ్లనున్న ట్విట్టర్ సంస్థ
 ఈ ఒప్పందం విషయంలో కోర్టుకు వెళ్లనున్నట్లు ట్విట్టర్ తెలిపింది. ఎలోన్ మస్క్‌తో ట్విట్టర్ అంగీకరించిన ధర, నిబంధనలపై లావాదేవీని మూసివేయడానికి ట్విట్టర్ బోర్డు కట్టుబడి ఉందని ఇంకా విలీన ఒప్పందాన్ని అమలు చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తోందని బోర్డు ఛైర్మన్ బ్రెట్ టేలర్ ఒక ట్వీట్‌లో తెలిపారు.

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 3,48,700 కోట్లు) కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించారు . డైలీ ఆక్టివ్ యూజర్లలో 5 శాతం కంటే తక్కువ మంది స్పామ్ ఖాతాలు ఉన్నారని కంపెనీ చూపించలేకపోతే, ఆ ఒప్పందం నుండి తప్పుకుంటామని మస్క్ చెప్పారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios