Dyson Zone:ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ ప్యూరిఫైయర్ మ్యూజిక్ హెడ్‌ఫోన్.. రీసర్చ్ కోసం 6 సంవత్సరాలు..

డైసన్ జోన్‌ ఇయర్‌కప్‌లోనే రెండు మోటార్లు ఉన్నాయి. ఈ రెండు మోటార్లు నోటికి, ముక్కుకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. ఇందులో తక్కువ, మధ్యస్థ, ఎక్కివ, ఆటో మోడ్ అనే నాలుగు ఎయిర్ ప్యూరిఫైయర్ మోడ్‌లు ఉంటాయి.
 

Dyson Zone: World's first air purifier headphone launched, took six years of research

వాక్యూమ్ క్లీనింగ్‌లో అగ్రగామి సంస్థ డైసన్(Dyson) ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన హెడ్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ డైసన్ హెడ్‌ఫోన్ పేరు డైసన్ జోన్, ఇది ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ హెడ్‌ఫోన్. డైసన్ జోన్‌తో కంపెనీ ధరించగలిగే మార్కెట్లోకి ప్రవేశించింది. డైసన్ జోన్‌కు సంబంధించి ముక్కు, నోటి దగ్గర ఫిల్టర్ చేసిన గాలి మంచి ప్రవాహంతో ఉంటుందని కంపెనీ పేర్కొంది. డైసన్ జోన్ హెడ్‌ఫోన్‌లతో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. 

డైసన్ జోన్‌లో అధిక-పనితీరు గల ఎయిర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్‌లు అందించబడ్డాయి. ఈ హెడ్‌ఫోన్ కోసం రీసర్చ్ చేయడానికి ఆరు సంవత్సరాలు పట్టిందని డైసన్ పేర్కొంది. గ్లోబల్ మార్కెట్‌లో త్వరలో అందుబాటులోకి రానున్నప్పటికీ, డైసన్ జోన్ ధర గురించి కంపెనీ ఇంకా సమాచారం ఇవ్వలేదు.

డైసన్ జోన్  ఫీచర్స్
డైసన్ జోన్‌ ఇయర్‌కప్‌లోనే రెండు మోటార్లు ఉంటాయి. ఈ రెండు మోటార్లు నోటికి, ముక్కుకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. ఇందులో తక్కువ, మధ్యస్థ, అధిక, ఆటో మోడ్ అనే నాలుగు ఎయిర్ ప్యూరిఫైయర్ మోడ్‌లు ఉన్నాయి. అవసరాన్ని బట్టి మోడ్‌లు ఆటోమేటిక్‌గా మారుతూనే ఉంటాయని కంపెనీ పేర్కొంది.

డైసన్ జోన్‌లో గాలి ప్యూరీఫై చేయడాని కోసం ఎలెక్ట్రోస్టాటిక్ ఫిల్టర్ ఉంది, ఇది 99 శాతం గాలిని ఫిల్టర్‌ చేస్తుందని కంపెనీ పేర్కొన్నారు. ఈ ఫిల్టర్లు దుమ్ము నుండి బ్యాక్టీరియా వరకు అన్నింటిని ఫిల్టర్ చేయగలదు. ఈ ఫిల్టర్లు నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, ఓజోన్ మొదలైన వాటిని ఫిల్టర్ చేయడానికి రూపొందించబడ్డాయి. కంపెనీ యాప్‌కి కనెక్ట్ చేయడం ద్వారా డైసన్ జోన్‌ను పర్యవేక్షించవచ్చు, డేటాను పొందవచ్చు.

నియోడైమియం డ్రైవర్లు డైసన్ జోన్‌లో అందించారు. దీనిలో ఐసోలేషన్, కన్జర్వేషన్ అండ్ ట్రాన్స్పరెంట్ వంటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మోడ్‌లు ఉన్నాయి. వీటిలో, ఐసోలేషన్ అనేది ANC టాప్ మోడ్. ఇందులో ఆడియో ప్లేబ్యాక్ మోడ్ కూడా ఉంది. కంపెనీ క్లెయిమ్ ప్రకారం, మీరు డైసన్ జోన్‌ని ఉపయోగిస్తే మీకు ఫేస్ మాస్క్ అవసరం లేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios