Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్లోకి మిలిటరీ గ్రేడ్ స్మార్ట్ ఫోన్.. కింద పడిన నీటిలో మునిగిపోయిన పాడవదు..

ప్రస్తుతానికి ఈ ఫోన్ ఇండియాలో ప్రవేశపెట్టలేదు. ఫోన్ 8జి‌బి  ర్యామ్ తో 128 జి‌బి స్టోరేజ్ వేరియంట్ ధర $ 349, అంటే దాదాపు రూ 28,913. 
 

DOOGEE S96 GT Falling on ground and submerging in water will not spoil, so many features are available
Author
First Published Oct 21, 2022, 12:20 PM IST

టఫ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ డూగీ కొత్త స్మార్ట్‌ఫోన్ డూగీ ఎస్96 జి‌టిని ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ Octa-core MediaTek Helio G95 ప్రాసెసర్‌తో పరిచయం చేశారు. ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ ఓఎస్‌తో వస్తుంది. ఫోన్‌తో పాటు 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా లభిస్తుంది. అలాగే, బ్రాండ్ ఎస్96 జి‌టి 8జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్‌ సపోర్ట్ ఇచ్చారు.

డూగీ ఎస్96 జి‌టి ధర 
ప్రస్తుతానికి ఈ ఫోన్ ఇండియాలో ప్రవేశపెట్టలేదు. ఫోన్ 8జి‌బి  ర్యామ్ తో 128 జి‌బి స్టోరేజ్ వేరియంట్ ధర $ 349, అంటే దాదాపు రూ 28,913. 

డూగీ S96 జి‌టి ఫీచర్స్ 
డూగీ S96 6.22 అంగుళాల HD + డిస్ ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ డిస్ ప్లేతో ఇచ్చారు.. ఫోన్‌లో 8 GB LPDDR4X ర్యామ్, 128జి‌బి స్టోరేజ్, ఆక్టా-కోర్ MediaTek Helio G95 ప్రాసెసర్‌, ఫోన్‌తో మిలిటరీ గ్రేడ్ స్ట్రెంత్ అందించారు అలాగే వాటర్‌ఫ్రూఫింగ్ కోసం ఫోన్ IP68/69K రేటింగ్‌ పొందింది. ఫోన్ MIL-STD-810H కాన్ఫిగరేషన్‌ పొందుతుంది. 

కెమెరా అండ్ బ్యాటరీ లైఫ్
ఫోన్ కెమెరా గురించి మాట్లాడితే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, 20 మెగాపిక్సెల్ నైట్ విజన్ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సపోర్ట్ ఉంది.  ఫోన్‌లో సెల్ఫీ అండ్ వీడియో కాల్‌ల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

డూగీ S96 GT పెద్ద 6350mAh బ్యాటరీతో వస్తుంది, ఇంకా 24W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఉంది. ఇతర కనెక్టివిటీ కోసం, ఫోన్ NFC ఫంక్షన్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, కస్టమ్ బటన్లు మొదలైన వాటికి సపోర్ట్ చేస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios