యుపిఐ లావాదేవీలు ఫెయిల్ అవుతున్నాయా ; గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి..
ఏదైనా లావాదేవీలు చేయడానికి UPI పిన్ అవసరం. అందుకే యూపీఐని రహస్యంగా ఉంచాలి. పిన్‌ను ఎవరితోనూ షేర్ చేయకూడదు.. పుట్టిన తేదీ లేదా సులభంగా గుర్తించగలిగే నంబర్‌లను పిన్ నంబర్‌గా ఉపయోగించవద్దు.
యుపిఐ ద్వారా పేమెంట్స్ చాలా ఆక్టీవ్ గా ఉంటాయి. డిజిటలైజేషన్‌లో భాగంగా, ఇది అత్యంత ఆమోదించబడిన పేమెంట్ విధానం ఇంకా దేశంలో ప్రతిరోజూ కోట్లాది UPI లావాదేవీలు జరుగుతున్నాయి. అంతేకాదు, లావాదేవీల పెరుగుదలతో UPI మోసం కేసులు కూడా పెరుగుతున్నాయి. UPI అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) చే అభివృద్ధి చేసిన ఇన్స్టంట్ పేమెంట్ సిస్టం. మీరు వీటిపై శ్రద్ధ వహిస్తే UPI ద్వారా సురక్షితంగా పేమెంట్స్ చేయవచ్చు. UPI పిన్ ద్వారా పేమెంట్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు..
UPI పిన్ సురక్షితంగా ఉండాలి:
ఏదైనా లావాదేవీలు చేయడానికి UPI పిన్ అవసరం. అందుకే యూపీఐని రహస్యంగా ఉంచాలి. పిన్‌ను ఎవరితోనూ షేర్ చేయకూడదు.. పుట్టిన తేదీ లేదా సులభంగా గుర్తించగలిగే నంబర్‌లను పిన్ నంబర్‌గా ఉపయోగించవద్దు.
అఫీషియల్ UPI యాప్‌లు;
లావాదేవీల కోసం బ్యాంకుల్లో రిజిస్టర్ చేయబడిన లేదా ఆథరైజేడ్ చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా అందించబడిన అధికారిక UPI యాప్‌లను మాత్రమే ఉపయోగించండి. డౌన్‌లోడ్ చేయడానికి ముందు అతేంటిసిటీ వెరిఫై చేసుకోండి.
రిసీవర్ వివరాలను చెక్ చేయండి :
మీరు డబ్బును ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, పంపినవారి ప్రొఫైల్‌ను చెక్ చేయండి ఇంకా ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోండి. రిసీవర్ వివరాలలో చిన్న లోపం ఉన్న డబ్బు మరొక వ్యక్తికి వెళ్తుంది.
ట్రాన్సక్క్షన్ అమౌంట్ చెక్ చేయండి;
డబ్బును ట్రాన్స్ఫర్ చేయడానికి ముందు, మీరు ట్రాన్స్ఫర్ చేయబోతున్న మొత్తం అమౌంట్ సరైనదేనా లేదా అని చెక్ చేయండి.
ఫిషింగ్ :
మీ బ్యాంక్ అధికారులుగా నటిస్తు మెసేజెస్, ఇమెయిల్‌లు లేదా కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు .తెలియని వ్యక్తుల నుండి పేమెంట్ రిక్వెస్ట్ తిరస్కరించండి లేదా అంగీకరించవద్దు
నెట్‌వర్క్ కనెక్టివిటీని చెక్ చేయండి:
UPI లావాదేవీని ప్రారంభించే ముందు మీకు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోండి. నెట్‌వర్క్ కనెక్టివిటీ తక్కువగా ఉంటే లావాదేవీలు ఫెయిల్ కావచ్చు లేదా ఎక్కువ సమయం పట్టవచ్చు.
లావాదేవీ రికార్డులు:
పేమెంట్ సంబంధిత లావాదేవీ IDలు, తేదీలు ఇంకా అమౌంట్ మొత్తాలతో సహా UPI లావాదేవీ వివరాలను స్టోర్ చేయండి. పేమెంట్ సమస్యలు లేదా వివాదాల విషయంలో వీటిని సాక్ష్యంగా ఉపయోగించవచ్చు.