డిజో వైర్‌లెస్ పవర్ ధర రూ. 1,399 అయితే లాంచింగ్ ఆఫర్ కింద దీనిని రూ.999కి కొనుగోలు చేయవచ్చు. దీనిని ఫిబ్రవరి 25 నుండి ఫ్లిప్‌కార్ట్ నుండి క్లాసిక్ బ్లాక్, హంటర్ గ్రీన్, వైలెట్ బ్లూ రంగులలో విక్రయించనుంది.

గ్లోబల్ టెక్నాలజి బ్రాండ్ డిజో(dizo) కొత్త వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ డిజో వైర్‌లెస్ పవర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. డిజో వైర్‌లెస్ పవర్‌తో పవర్ హైవ్ డిజైన్ ఇచ్చింది. అంతేకాకుండా దీనిలో 11.2mm డ్రైవర్‌ ఉంది, ఇంకా బేస్ బూస్ట్ + అల్గోరిథంతో వస్తుంది. అంటే వేగంగా పెరింగ్ చేయడానికి కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ ప్రత్యేక గేమ్ మోడ్ ఇవ్వబడింది.

డిజో వైర్‌లెస్ పవర్ ధర
డిజో వైర్‌లెస్ పవర్ ధర రూ. 1,399 అయితే లాంచింగ్ ఆఫర్ కింద దీనిని రూ.999కి కొనుగోలు చేయవచ్చు. ఫిబ్రవరి 25 నుండి ఫ్లిప్‌కార్ట్ నుండి క్లాసిక్ బ్లాక్, హంటర్ గ్రీన్, వైలెట్ బ్లూ రంగులలో విక్రయించబడుతుంది.

డిజో వైర్‌లెస్ పవర్ స్పెసిఫికేషన్లు
కంపెనీ ప్రకారం దినిని థర్మోప్లాస్టిక్ పాలియురేతేన్ (TPU) నుండి తయారు చేయబడింది, అంటే వినియోగదారులకు సౌకర్యవంతమైన అనుభూతిని ఇస్తుంది. దీనిలో Bass Boost+కి సపోర్ట్ తో 11.2mm డ్రైవర్‌ ఉంది. ఇంకా మేగ్నెటిక్ స్పీడ్ పెరింగ్ సపోర్ట్ ఉంది. దీని బడ్స్ ఉపయోగించనప్పుడు అవి ఒకదానికొకటి కనెక్ట్ అవుతాయి. బడ్స్ కనెక్ట్ అయినప్పుడు మ్యూజిక్ పాజ్ అవుతుంది.

డిజో వైర్‌లెస్ పవర్‌తో ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) ఉంది. అంటే ఒక ప్రత్యేక గేమ్ మోడ్‌. దీనిలో 88ms వరకు లో లాటెన్సి ఉందని పేర్కొంది. వాటర్ రిసిస్టంట్ కోసం IPX4 రేటింగ్‌ను పొందింది. దీన్ని Realme Link యాప్‌కి కనెక్ట్ చేయవచ్చు ఇంకా యాప్ ద్వారానే ఈక్వలైజర్‌ని ఉపయోగించవచ్చు.

డిజో వైర్‌లెస్ పవర్ 18 గంటల క్లెయిమ్ బ్యాకప్‌తో 150mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇంకా స్పీడ్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది, అలాగే 10 నిమిషాల ఛార్జింగ్ తర్వాత 2 గంటల బ్యాకప్‌ను ఇస్తుందని పేర్కొన్నారు. దీని ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్ ఇంకా కనెక్టివిటీ కోసం బ్లూటూత్ v5.2 ఉంది.