Dizo Wireless Dash: ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 30 గంటల బ్యాటరీ లైఫ్.. ధర కూడా తక్కువే..!
Realme లెటెస్ట్ ఇయర్‌ఫోన్ బ్రాండ్ Dizo Wireless Dash వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ ఇయర్‌ఫోన్‌ను 10 నిమిషాల ఛార్జ్ చేస్తే 10 గంటల ప్లేబ్యాక్‌ను పొందువచ్చని కంపెనీ పేర్కొంది.
Realme నెక్‌బ్యాండ్ స్టైల్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్ తాజాగా లంచ్ చేసింది. డిజో వైర్‌లెస్ డాష్(Dizo Wireless Dash) పేరుతో రీలిజ్ చేసిన ఈ ఇయర్‌ఫోన్ మంచి స్టార్ రెటింగ్‌ను కలిగి ఉంది. ఈ Dizo Wireless Dash 30 గంటల బ్యాటరీ లైఫ్‌తో, మంచి సౌండ్ క్వాలిటితో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. దీని ధర రూ.1,599 ఉండగా.. పరిచయ ఆఫర్‌లో భాగంగా రూ.1,299కే అందిస్తుంది. ఈ ఇయర్‌ఫోన్‌ను 10 నిమిషాల ఛార్జ్ చేస్తే 10 గంటల ప్లేబ్యాక్‌ను పొందుతారని కంపెనీ పేర్కొంది. ఇక ఈ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లకు సంబందించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రత్యేకమైన, ప్రీమియం డిజైన్ గల ఇయర్‌ఫోన్ క్లాసిక్ బ్లాక్, ఎలక్ట్రిక్ బ్లూ, డైనమిక్ గ్రీన్ వంటి మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. బాక్స్ ఒపెన్ చేస్తే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు, త్రీ ఇయర్‌టిప్‌లు, టైప్-సి ఛార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్ ఉంది. ఈ ప్రీమియం డిజైన్ ఇయర్‌ఫోన్‌కు USB ఛార్జింగ్ పోర్ట్, వాల్యూమ్ బటన్లు, కంట్రోల్ బటన్ ఉన్నాయి.
డిజైన్
ఇయర్‌ఫోన్‌లు ఆన్ చేయగానే కుడివైపున ఇండికేటర్ లైట్ ఉంటుంది. ఎడమ అంచు ఖాళీగా ఉండగా. సిలికాన్ నెక్‌బ్యాండ్‌ను దీనిని రూపొందించారు. దీని స్కిన్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. చెవిలో కూడా కరక్ట్‌గా సెట్ అవుతుంది. మాగ్నెటిక్ ప్రాపర్టీ (అయస్కాంతం) కారణంగా దీని క్లిప్‌లు ఒకదానితో ఒకటి అతుక్కొని ఉంటాయి. మీరు వాటిని వేరు చేసిన వెంటనే, ఇయర్‌ఫోన్‌లు ఆన్ అవుతాయి. ఇయర్‌ఫోన్‌ల బరువు కేవలం 37.7 గ్రాముల వరకు ఉంటుంది.
ఆడియో నాణ్యత
Dizo Wireless Dash బాస్ బూస్ట్+తో 11.2mm ఆడియో డ్రైవర్‌ను ఇందులో పిక్స్ చేశారు. బ్లూటూత్ 5.2కి కనెక్టివిటీకి ఈ ఇయర్‌ఫోన్ సపోర్ట్ చెస్తోంది. ఇయర్‌ఫోన్‌లు గేమింగ్ మోడ్‌కు సపోర్ట్‌కు ఇస్తాయి. దీని కారణంగా, సౌండ్ నాయిస్ 50 శాతం వరకు తగ్గుతుంది. బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ను కూడా తగ్గిస్తుంది. స్పష్టమైన వాయిస్ వచ్చే విధంగా ENC అంటే ఎన్విరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉంది. ఇది IPX4 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది.
బ్యాటరీ లైఫ్
ఎక్కువ సమయం వచ్చేలా బ్యాటరీ లైఫ్‌ను అందించారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 30 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. రోజుకు 3-4 గంటలు సంగీతం వింటే, వారం పాటు సులభంగా బ్యాటరీ లైఫ్ వస్తోంది. ఇయర్‌ఫోన్‌లు ఛార్జింగ్ సపోర్ట్ అద్భుతంగా ఉంది. దీన్ని 10 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే 10 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్‌ను అందంచారు. షార్ట్ సర్క్యూట్ కాకుండా సేప్టీ ఫీచర్స్‌ను అందించారు.