డేటా లీక్: ఆన్‌లైన్‌లో అమ్మకానికి 4 కోట్ల మంది అడ్రస్ సహా పర్సనల్ డేటా..
లీక్ అయిన డేటా వివరాలను కూడా పోస్ట్ ద్వారా వెల్లడించింది. అడ్రస్ ఇంకా కస్టమర్ పేర్లతో పాటు, “డెల్ హార్డ్‌వేర్ అండ్ సర్వీస్ ట్యాగ్, ఐటెమ్ డిస్క్రిప్షన్, ఆర్డర్ తేదీ ఇంకా సంబంధిత వారంటీ సమాచారంతో సహా ఆర్డర్ సమాచారం” కూడా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.
డెల్ టెక్నాలజీస్ కంపెనీ భారీ డేటా ఉల్లంఘనను ఎదుర్కొన్నట్లు ప్రకటించింది, ఇందులో యూజర్ వ్యక్తిగత వివరాలు ఆన్‌లైన్‌లో ఉన్నట్లు వెల్లడయ్యాయి. ఈ డేటాలో కస్టమర్ పేర్లు, అడ్రస్ కూడా ఉన్నాయి. Dell తాజాగా ఒక పోస్ట్ లో “Dell Technologies మీ సమాచారం గోప్యతను తీవ్రంగా పరిగణిస్తుంది. మేము ప్రస్తుతం Dell నుండి కొనుగోళ్లకు సంబంధించిన కస్టమర్ సమాచారంతో డేటాబేస్ ఉన్న Dell పోర్టల్‌కు సంబంధించిన సంఘటనను పరిశీలిస్తున్నాము. సమాచారం రకాన్ని బట్టి మా కస్టమర్‌లకు పెద్దగా ప్రమాదం లేదని మేము విశ్వసిస్తున్నాము అని తెలిపింది.
లీక్ అయిన డేటా వివరాలను కూడా పోస్ట్ ద్వారా వెల్లడించింది. అడ్రస్ ఇంకా కస్టమర్ పేర్లతో పాటు, “డెల్ హార్డ్‌వేర్ అండ్ సర్వీస్ ట్యాగ్, ఐటెమ్ డిస్క్రిప్షన్, ఆర్డర్ తేదీ ఇంకా సంబంధిత వారంటీ సమాచారంతో సహా ఆర్డర్ సమాచారం” కూడా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.
కంపెనీ ప్రకారం, ఉల్లంఘించిన డేటాలో ఇమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్లు, ఫైనాన్సియల్ లేదా పేమెంట్ సమాచారం లేదా "ఏదైనా అత్యంత సున్నితమైన కస్టమర్ సమాచారం" లేదు. ముఖ్యంగా, డేటా ఉల్లంఘన వల్ల ఎంత మంది కస్టమర్లు ప్రభావితమయ్యారో కంపెనీ వెల్లడించలేదు. అసలు ఈ ఉల్లంఘనకు కారణమేమిటో కూడా వెల్లడించలేదు.
TechCrunch ద్వారా ఈ ఉల్లంఘనకు సంబంధించిన వివరాల గురించి అడిగినప్పుడు, ఒక కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, “మేము మా దర్యాప్తు కొనసాగిస్తున్నాము. ఇప్పుడే సమాచారాన్ని బహిర్గతం చేయలేము”. అని అన్నారు.
ఈ డేటా ఉల్లంఘన వల్ల 4 కోట్లకు పైగా వినియోగదారులు ప్రభావితమయ్యారని బ్లీపింగ్ కంప్యూటర్ నివేదిక పేర్కొంది. ఏప్రిల్ 28న బ్రీచ్ ఫోరమ్స్ హ్యాకింగ్ ఫోరమ్‌లో మెనెలిక్ అనే హ్యాకర్ డెల్ డేటాబేస్‌ను అమ్మకానికి ప్రయత్నించినట్లు వెల్లడైంది.
ఇటీవల, భారతీయ యూజర్స్ వాడే బ్రాండ్ BoAt కూడా పెద్ద డేటా ఉల్లంఘనను ఎదుర్కొంది. ఈ డేటా ఉల్లంఘనలో 7.5 కోట్ల కంటే ఎక్కువ మంది కస్టమర్ల వ్యక్తిగత సమాచారం అమ్మకానికి పెట్టారు.
ShopifyGUY అని పిలువబడే హ్యాకర్ ద్వారా ఉల్లంఘన జరిగిందని ఆరోపించబడింది. లీక్ అయిన డేటాలో పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఇమెయిల్ అడ్రస్, కస్టమర్ IDలు వంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారం ఉంది. హ్యాకర్ డార్క్ వెబ్‌లో boAt యూజర్స్ 2GB పర్సనల్ ఐడెంటిఫై సమాచారాన్ని (PII) అమ్మకానికి ఉంచారు.