Asianet News TeluguAsianet News Telugu

పాస్‌వర్డ్‌ మర్చిపోయాడు.. కానీ 11 సంవత్సరాల తర్వాత చూస్తే డబ్బే డబ్బు..

అప్పట్లో బిట్‌కాయిన్‌కు పెద్దగా విలువ లేకపోవడంతో యజమాని దాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల బిట్‌కాయిన్ విలువ 20000 శాతానికి పైగా పెరిగింది, దింతో ఆ యజమాని వాలెట్‌ తిరిగి పొందాలని నిర్ణయించుకున్నాడు. 
 

Crypto wallet's owner forgets password, 11 years later, hacker gets hold of crores-sak
Author
First Published Jun 7, 2024, 12:35 AM IST

 హ్యాకింగ్ కారణంగా అకౌంట్లో  నుండి డబ్బు పోగొట్టుకున్న వార్తలు మనం  చాలా చూసే ఉంటాం, అయితే యూరప్‌కు చెందిన ఒక మిలియనీర్ 3 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని తిరిగి దక్కించుకొని కోటీశ్వరుడు అయ్యాడు. హ్యాకర్లలో కింగ్‌పిన్ అని పిలువబడే ఎలక్ట్రికల్ ఇంజనీర్ జో గ్రాండ్ హ్యాకింగ్ ద్వారా పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. అయితే ఒక వ్యక్తి 11 సంవత్సరాల క్రితం క్రియేట్ చేసిన  క్రిప్టోకరెన్సీ వాలెట్ పాస్‌వర్డ్‌ను మర్చిపోయాడు. 

ఈ వాలెట్‌లో 43.6 బిట్‌కాయిన్‌లు (రూ. 245779936 సుమారుగా) ఉన్నాయి. 2013 నుండి బిట్‌కాయిన్‌ అకౌంట్  యజమాని పాస్‌వర్డ్‌ను మర్చిపోవడంతో ఎలాంటి లావాదేవీలు చేయలేకపోయారు. పాస్‌వర్డ్ ఉంచిన టెక్స్ట్ ఫైల్ పాడవడంతో యజమాని ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పట్లో బిట్‌కాయిన్‌కు పెద్దగా విలువ లేకపోవడంతో యజమాని దాన్ని అంతగా  పట్టించుకోలేదు. కానీ ఇటీవల బిట్‌కాయిన్ విలువ 20000 శాతానికి పైగా పెరిగింది, దింతో ఆ యజమాని వాలెట్‌ను తిరిగి పొందాలని నిర్ణయించుకున్నాడు. 

ఇందుకు అతను కింగ్‌పిన్‌ అనే హ్యాకర్ని సంప్రదించాడు. మొదట్లో అంతగా శ్రద్ధ చూపకపోయినా  హ్యాకర్ వాలెట్ యజమానికి సహాయం చేయాలని అనుకున్నాడు. అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీ NSA అభివృద్ధి చేసిన రివర్స్ ఇంజనీరింగ్ టూల్‌ను ఉపయోగించి పాస్‌వర్డ్ రికవర్ చేసాడు. క్రిప్టోకరెన్సీ వాలెట్‌లలోని కొన్ని ప్రమాణాలు వాలెట్ యజమాని పాస్‌వర్డ్‌ను మరచిపోవడాన్ని కూడా సవాలుగా మారుస్తాయని కింగ్‌పిన్ వివరించాడు. రోబోఫార్మ్ క్రిప్టోకరెన్సీ పాస్‌వర్డ్‌ను రూపొందించిన క్రమాన్ని కనుగొనడంలో జో గ్రాండ్ కీలక పాత్ర పోషించాడు. 

పదేళ్ల వయసు నుంచి హ్యాకింగ్‌ నేర్చుకుంటున్న  జో గ్రాండ్ 2008లో డిస్కవరీ ఛానల్ ప్రోటోటైప్ షోలో కూడా పాల్గొన్నాడు. అంతకుముందు 2022లో, ఒక వ్యక్తికి క్రిప్టోకరెన్సీ వాలెట్ అకౌంట్ మర్చిపోయిన పాస్‌వర్డ్ ఇచ్చారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios