ఈ వాచ్‌తో పాటు కంపెనీ క్రాస్‌బీట్స్ ఎక్స్‌ప్లోర్ యాప్‌ను కూడా విడుదల చేసింది, ఈ యాప్ మేడ్ ఇన్ ఇండియా యాప్. కంపెనీ క్లెయిమ్ ప్రకారం, క్రాస్‌బీట్స్ ఇగ్నైట్ లైట్ దాని సెగ్మెంట్‌లో అత్యంత తేలికైన స్మార్ట్‌వాచ్. 

క్రాస్‌బీట్స్ ఇగ్నైట్ లైట్ స్మార్ట్‌వాచ్ ఇండియాలో లాంచ్ అయ్యింది. క్రాస్‌బీట్స్ ఇగ్నైట్ లైట్ అనేది 1.69-అంగుళాల డిస్‌ప్లేతో కూడిన లైట్ వెట్ స్మార్ట్‌వాచ్. డిస్ ప్లేలో 2.5D కర్వ్డ్ గ్లాస్ ఉంది. ఈ వాచ్‌తో పాటు కంపెనీ క్రాస్‌బీట్స్ ఎక్స్‌ప్లోర్ యాప్‌ను కూడా విడుదల చేసింది, ఈ యాప్ మేడ్ ఇన్ ఇండియా యాప్. కంపెనీ క్లెయిమ్ ప్రకారం, క్రాస్‌బీట్స్ ఇగ్నైట్ లైట్ దాని సెగ్మెంట్‌లో అత్యంత తేలికైన స్మార్ట్‌వాచ్.

క్రాస్‌బీట్స్ ఇగ్నైట్ లైట్ ధర, ఫీచర్లు చూస్తే క్రాస్‌బీట్స్ ఇగ్నైట్ లైట్ ధర రూ. 1,999.దీనిని Crossbeats అధికారిక వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. Crossbeats Ignite Lyt కార్బన్ బ్లాక్, సఫైర్ బ్లూ, జెనిత్ గోల్డ్ కలర్స్ లో అందుబాటులో ఉంది.

ఫీచర్ల గురించి చెప్పాలంటే 2.5D గ్లాస్‌తో 1.69-అంగుళాల డిస్‌ప్లే ఉంది. దీనితో పాటు స్లీప్ ట్రాకింగ్ మల్టీ స్పోర్ట్స్ మోడ్‌తో వస్తుంది, దీని డేటా 7 రోజుల పాటు సేవ్ చేయబడుతుంది. Crossbeats Ignite Lyt బ్లడ్ ఆక్సిజన్‌ ట్రాక్ చేయడానికి SpO2 సెన్సార్‌తో వస్తుంది. ఈ వాచ్ 24 గంటల పాటు హార్ట్ బీట్ రేటును ట్రాక్ చేయగలదు. 

ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌వాచ్ వాటర్ రెసిస్టెంట్ కోసం IP68 రేటింగ్‌ పొందింది, బ్యాటరీకి సంబంధించి 15-రోజుల బ్యాకప్ క్లెయిమ్ చేయబడింది. Crossbeats Xplore యాప్‌కు సంబంధించి యూజర్ల మెరుగైన గోప్యతను కంపెనీ క్లెయిమ్ చేసింది.