Asianet News TeluguAsianet News Telugu

నెట్‌ఫ్లిక్స్ ఉదారత: సినీ కార్మికుల కోసం 10 కోట్ల డాలర్ల నిధి

కరోనా మహమ్మారి వల్ల కార్మికులు.. అసంఘటిత రంగ కార్మికులకు కష్టగాలం దాపురించింది. ఈ కోవకు చెందిన వారే సినీ కార్మికులు. కరోనా వ్యాపిస్తుండటంతో వివిధ దేశాలు అంతర్గతంగా కార్యక్రమాలను, పనులను నిలిపేస్తున్నాయి. సరిహద్దులను మూసేస్తున్నాయి. 

Coronavirus pandemic: Netflix establishes $100 million relief fund for film, TV workers whose projects have been halted
Author
New Delhi, First Published Mar 22, 2020, 10:38 AM IST

కరోనా మహమ్మారి వల్ల కార్మికులు.. అసంఘటిత రంగ కార్మికులకు కష్టగాలం దాపురించింది. ఈ కోవకు చెందిన వారే సినీ కార్మికులు. కరోనా వ్యాపిస్తుండటంతో వివిధ దేశాలు అంతర్గతంగా కార్యక్రమాలను, పనులను నిలిపేస్తున్నాయి. సరిహద్దులను మూసేస్తున్నాయి. 

అలాగే కరోనా ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా పలు సినిమాల చిత్రీకరణలు, టీవీ కార్యక్రమాలను నిలిపివేశారు. ఇలా షూటింగ్‌లను నిలిపేయడంతో ప్రపంచ వ్యాప్తంగా సినిమా కార్మికుల కోసం 10 కోట్ల డాలర్ల సహాయ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది.  

‘సినిమా రంగం, టీవీ రంగం జోరుగా సాగిన రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌కు మద్దతుగా నిలిచాయి. ఈ కష్ట సమయంలో వారికి సహాయం చేయాలని అనుకుంటున్నాం’ అని నెట్ ఫ్లిక్స్ చీఫ్ క్రియేటివ్ అధికారి టెడ్ సరండోన్ తెలిపారు.

ప్రస్తుతం ఎలక్ట్రీషియన్లు, వడ్రంగి పని చేసే వారు, డ్రైవర్లు, ఎక్కువగా ఒక చిత్రీకరణ నుంచి మరొకదానికి వెళుతూ గంటల ప్రాతిపదికన వేతనాలు తీసుకునే లక్షల మంది బుల్లి ఆర్టిస్టులు వంటి వారు లక్షల మంది పనులు లేక ఖాళీగా ఉన్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ సొంత నిర్మాణ సంస్థల్లో పని చేస్తున్న దిగువ శ్రేణి సిబ్బందికి ఎక్కువ శాతం నిధులను కేటాయిస్తామని నెట్ ఫ్లిక్స్ చీఫ్ క్రియేటివ్ అధికారి టెడ్ సరండోన్ చెప్పారు. 
ఇప్పటికే చిత్రీకరణలు పూర్తిగా ఆపేసిన నిర్మాణ సంస్థలలోని సినీ నటులు, సిబ్బందికి రెండు వారాల వేతనం ఇవ్వడానికి నెట్ ఫ్లిక్స్ అంగీకరించింది. 1.5 కోట్ల డాలర్ల సహాయ నిధి తమకు పెద్ద ఎత్తున నిర్మాణ సంస్థలు ఉన్న దేశాల్లో లాభాపేక్ష లేకుండా సాయం అందిస్తామని నెట్ ఫ్లిక్స్ చీఫ్ క్రియేటివ్ అధికారి టెడ్ సరండోన్ చెప్పారు.

యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలతోపాటు పలు చోట్ల సహాయ చర్యల్లో పాలుపంచుకోనున్నట్లు నెట్ ఫ్లిక్స్ చీఫ్ క్రియేటివ్ అధికారి టెడ్ సరండోన్ తెలిపారు.ఈ విషయమై తాము చేపట్టే రిలీఫ్ చర్యలను వచ్చేవారం ప్రకటిస్తామని తెలిపారు. 

ఎప్పుడేమీ జరుగుతుందో అంచనా వేయలేమని నెట్ ఫ్లిక్స్ పేర్కొంది. అంతా కలిసి పని చేస్తేనే బలంగా ఉంటామని, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సాయం చేయడం తమ అద్రుష్టం అని నెట్ ఫ్లక్స్ చీఫ్ క్రియేటివ్ అధికారి టెడ్ సరండోన్ చెప్పారు.

also read:గడువు దాటాక.. పాన్ కార్డు లింక్ చేయకుంటే.. రూ.10 వేల ఫైన్

అమెరికాలోని ఎన్ఎజీ-ఎఎఫ్టీఆర్ఏ కోవిద్-19 విపత్తు నివారణ నిధి, మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ఫండ్, యునైటెడ్ స్టేట్స్ లోని యాక్టర్స్ అండ్ ఎమర్జెన్సీ అసిస్టెన్స్‌కు 10 లక్షల డాలర్లు విరాళంగా అందచేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. ఇంతకుముందు యాక్టర్స్ ఫండ్ ఆఫ్ కెనడా (ఏఎఫ్సీకే)కు 10 లక్షల డాలర్లు డొనేట్ చేస్తున్నట్లు తెలిపింది. 

ఇంటర్నేషనల్ అలయెన్స్ ఆఫ్ థియేట్రికల్ స్టేజ్ ఎంప్లాయీస్ (ఐఏటీఎస్ఈ)లో సినిమాటోగ్రాఫర్లు, సంపాదకులు, ప్రొడక్షన్ డిజైనర్లు తదితర విభాగాల వారు 1.20 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని హాలీవుడ్ రిపోర్టర్ తెలిపింది. 

కరోనా వైరస్ వ్యాపించకుండా నిరోధించడానికి వివిధ దేశాలు చేస్తున్న, చేసిన ప్రయత్నాలు వినోద పరిశ్రమను దెబ్బ కొట్టాయి. చాలా నిర్మాణాలను నిలిపివేయడం, సినిమా థియేటర్లను మూసివేయడం వంటి వివిధ కార్యక్రమాలను వాయిదా వేయడం వంటి ప్రభుత్వ ఆంక్షలతో చాలా మంది ఇంటికి పరిమితం కావడంతో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ఫ్రైమ్ వంటి సంస్థలకు లాభాలు చాలా వస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios