Caution:మీ మొబైల్‌లో ఈ నాలుగు యాప్స్ ఉంటే వెంటనే తొలగించండి, లేకుంటే బ్యాంక్ ఖాతా ఖాళీ..
కాల్స్ చేయడానికి, నెట్ బ్యాంకింగ్, ఇంట్లో కూర్చొని షాపింగ్ చేయడానికి, గేమ్స్ ఆడుకోవడానికి ఇలా ఎన్నో పనులు మొబైల్ ద్వారా చేస్తుంటారు. అయితే ఇవన్నీ చేయడానికి, స్మార్ట్‌ఫోన్‌లో ఒక యాప్ అవసరం.
ఈ రోజుల్లో ఎవరి చేతిలో చూసినా మొబైల్ ఫోన్ కనిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మొబైల్ వాడుతున్నారు. దీని ద్వారా ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే కాకుండా ఎన్నో రకాల పనులు కూడా చేసుకుంటున్నారు. మొబైల్ సహాయంతో, మీరు మీ పనులను ఒకే క్లిక్‌లో చేయవచ్చు. కాల్స్ చేయడానికి, నెట్ బ్యాంకింగ్, ఇంట్లో కూర్చొని షాపింగ్ చేయడానికి, గేమ్స్ ఆడుకోవడానికి ఇలా ఎన్నో పనులు మొబైల్ ద్వారా చేస్తుంటారు. అయితే ఇవన్నీ చేయడానికి, స్మార్ట్‌ఫోన్‌లో ఒక యాప్ అవసరం, వీటిని మీరు ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ మీ మొబైల్‌కు ప్రమాదకరంగా మారే కొన్ని యాప్‌లు ఉన్నాయని మీకు తెలుసా? బహుశా తెలిసి ఉండదు. కానీ మోసగాళ్లు మీ బ్యాంకింగ్ సమాచారాన్ని దొంగిలించడానికి, ప్రజలను మోసం చేయడానికి కొన్ని యాప్‌లను సృష్టించారు. కాబట్టి మీరు వెంటనే మీ మొబైల్ నుండి తీసివేయవలసిన ఆ యాప్‌లు ఎంటో తెలుసుకుందాం...
ఈ రకమైన యాప్స్ నుండి దూరంగా ఉండండి: -
ఫ్రీ యాంటీ వైరస్
ప్రజలు మొబైల్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి ఎన్నో రకాల ఫ్రీ యాంటీ వైరస్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంటారు. అయితే ఈ యాప్‌లు మీ మొబైల్‌లో ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేయకుండా ఉండండి, లేదంటే ఈ యాప్స్ మీ మొబైల్‌కు హాని కలిగించవచ్చు.
ఫ్లాష్ లైట్ యాప్
చాలా మంది మొబైల్‌లో ఫ్లాష్ లైట్ యాప్‌ని విడిగా డౌన్‌లోడ్ చేస్తుంటారు, ఇందులో చాలా రకాల ఫీచర్లు ఉన్నాయి. కానీ ఈ యాప్‌లు మీ చాలా రహస్య సమాచారాన్ని దొంగిలిస్తాయని, దుర్వినియోగం చేస్తున్నాయని మీకు తెలియకపోవచ్చు. కాబట్టి వాటిని డౌన్‌లోడ్ చేయకుండా ఉండండి.
కీబోర్డ్ యాప్
మీరు మొబైల్ కొనుగోలు చేసినప్పుడు బేసిక్ కీబోర్డ్ అందులో ఉంటుంది. అయితే ఈ కీబోర్డ్ సాధారణ కీబోర్డ్, కొందరు వ్యక్తులు మొబైల్‌కి ప్రత్యేక కీబోర్డ్‌ని యాడ్ చేస్తుంటారు. కొత్త ఎమోజి, కొత్త వ్రైటింగ్ స్టాయిల్ పొందేందుకు ఇలా చేస్తారు.
కానీ మొబైల్‌లో విడిగా ఇన్‌స్టాల్ చేసే కీబోర్డ్ యాప్ వారి ఐడి పాస్‌వర్డ్ వంటి వాటిని దొంగిలించగలదని గ్రహించలేరు. మీరు ఈ రకమైన యాప్‌ను నివారించడం చాలా ముఖ్యం.
క్లీనర్ యాప్
మనం మన మొబైల్‌ని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత ఎక్కువ క్యాచి అండ్ జంక్ ఫైల్స్ అందులోకి వస్తాయి. వాటిని డిలెట్ చేయడం కూడా అవసరం, తద్వారా మొబైల్ స్పీడ్ పెరుగుతుంది. కానీ చాలా సార్లు దీని కోసం ఎన్నో రకాల యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంటారు, ఈ యాప్స్ ముందుగా మీ ఫోన్‌లోని కొన్నిటికి అనుమతిని అడుగుతుంది. ఆ తర్వాత మీ నుండి మీ సమాచారాన్ని దొంగిలిస్తుంది.