ఏడేళ్ల నుంచి మొబైల్ ఫోన్ల రంగంలో ‘నోకియా’దే ఆధిపత్యం. అదీ ‘సింబియాన్ ఓఎస్’పై మొబైల్ ఫోన్ విపణిలోకి తీసుకొచ్చింది. అప్పట్లో సంచలనం నెలకొల్పిన ఈ స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల వాడకం దారుల సంఖ్య పెరిగింది. 

దీనికి తోడు మొబైల్ ఫోన్లలో కెమెరాలు సైతం వీజీఏ కెమెరా నుంచి ఇప్పుడు 64 మెగా పిక్సెల్స్‌కు చేరాయి. ఇప్పుడు చైనా మొబైల్ కంపెనీలు ‘మెగా పిక్సెల్స్’ పేరిట యూజర్లను ఆకర్షిస్తున్నారు. ప్రకటనలు కూడా వాటి కేంద్రంగా సాగాయి. దీంతో అమ్మకాలు కూడా మెగా పిక్సెల్ కెమెరాలే కేంద్రంగా సాగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. 

8.1 స్మార్ట్‌ఫోన్‌పై నోకియా తగ్గింపు.. రాయితీలు కూడా..!

అందుబాటులో ఉన్న ధరలు గల మొబైల్ ఫోన్లను తేవడంతో స్మార్ట్ ఫోన్ల యూజర్లు వీటిపైనే ద్రుష్టిని కేంద్రీకరిస్తున్నారు. భారత విపణిలోకి రియల్ మీ తొలిసారి 64 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్ తీసుకు వచ్చింది. రియల్ మీ ఎక్స్ టీ పేరిట తీసుకొచ్చిన ఈ 64 మెగా పిక్సెల్ కెమెరా పోన్ మొత్తం సమూల మార్పులు తీసుకొస్తుందని భావించారు. 

తాజాగా షియోమీ కూడా రెడ్ మీ నోట్ 8 ప్రో పేరిట 64 ఎంపీ కెమెరాను తీసుకొచ్చింది. ఇక శామ్ సంగ్ 108 మెగా పిక్సెల్ కెమెరా తేనున్నది. ఇప్పటికే 108 ఎంపీ సెన్సర్ తోనే ఒక మొబైల్ ఫోన్ తీసుకు వస్తానని ఇప్పటికే ప్రకటించింది.

2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా సగానికి పైగా స్మార్ట్ ఫోన్లు మూడు అంతకన్నా ఎక్కువ కెమెరాలు గల ఫోన్లు అమ్ముడవుతాయని ‘కౌంటర్ పాయింట్’ పేర్కొంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రత్యర్థి స్మార్ట్ ఫోన్ కంపెనీలను తట్టుకోవాలంటే ఏదో ఒక ప్రత్యకత కల ఫోన్ తేవాల్సిన అవసరం అన్ని స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీలకు ఏర్పడింది.

దీంతో మొబైల్ కంపెనీలన్నీ కెమెరాలు, ఇతర ఫీచర్లపై అత్యధికంగా కేంద్రీకరిస్తున్నాయి. ‘ఇదంతా మార్కెట్ టెక్నిక్. స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకట్టుకోవడానికి హైలేట్ చేసే ఫీచర్లను పెద్దవిగా చూపుతూ కంపెనీలు తమ మొబైల్ పోన్ల విక్రాయలు పెంచుకుంటాయని డివైజ్ అండ్ ఎకో సిస్టమ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ తెలిపారు.

2020 తొలి అర్థభాగంలో 92 మెగా పిక్సెల్, 108 మెగా పిక్సెల్ కెమెరాలు గల మొబైల్ ఫోన్ల మార్కెట్ నడిచే అవకాశం ఉందన్నారు. సాధారనంగా స్మార్ట్ ఫోన్ యూజర్ మెగా పిక్సెల్స్ పై పెద్దగా కేంద్రీకరించరని చెప్పారు.

బడ్జెట్ ధరకే ఒకేసారి ‘లెనోవో’ మూడు ఫోన్లు విపణిలోకి ..

ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 48 మెగా పిక్సెల్స్ కల మొబైల్ ఫోన్లు 14 శాతం కంపెనీలు తీసుకు రాగా, 70 శాతం మొబైల్ ఫోన్లు రెండు అంతకన్నా ఎక్కువ కెమెరాలు గల స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చామని కౌంటర్ పాయింట్ పేర్కొంది.

ఎక్కువ మెగా పిక్సెల్ ఉంటే అంత బాగా ఫోటో వస్తుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అనలిస్ట్ కరణ్ చౌహాన్ తెలిపారు. లెన్స్ సైజ్, అపెచర్, ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్, సాఫ్ట్ వేర్ ఆల్గారిథమ్స్, ఎఐ పలు అంశాలపై ముడి పడి ఉంటుందన్నారు. 

మెగా పిక్సెల్స్ ఎక్కువగా ఉంటే ఫోటో బాగా వస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. కెమెరా ప్రధానమని మొబైల్ ఫోన్లు కొనేవాళ్లు మెగా పిక్సెల్స్ సంఖ్యతోపాటు మిగతా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తారు.