Byju's Layoffs: 500 మంది ఉద్యోగులను తొలగించిన బైజూస్.. నోటీసు లేకుండా ఒక్క ఫోన్‌తో కాల్ తో అవుట్..

మీడియా నివేదికల ప్రకారం, బైజూస్ ఫోన్ కాల్స్‌ ద్వారా ఈ తొలగింపులను చేసింది.   పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్  (పిఐపి)లో ఉంచకుండా ఉద్యోగులను వైదొలగాలని  కోరింది.
 

Byjus Layoffs: Byju lays off 500 employees; Information is being given over phone without notice period-sak

ఎడ్యూటెక్  కంపెనీ బైజూస్ తాజాగా దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే ఈ కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్‌లో పెద్ద ఎత్తున ఈ తొలగింపులు చేసింది. 

మీడియా నివేదికల ప్రకారం, బైజూస్ ఫోన్ కాల్ ద్వారా ఈ తొలగింపులను చేసింది అండ్  పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ (PIP)లో ఉంచకుండా ఉద్యోగులను వైదొలగమని కోరింది. అయితే ఈ నోటీసు వ్యవధిలో కంపెనీ ఉద్యోగులను పని చేయమని కూడా అడగడం లేదని నివేదికలు పేర్కొన్నాయి.

సోర్సెస్  ప్రకారం, ఈ కొత్త  తొలగింపులు బైజూస్ తొలగింపులలో  ఉద్యోగుల సంఖ్య 100 నుండి 500 మధ్య ఉండవచ్చు. ఇంకా ఈ తొలగింపుల కారణంగా కంపెనీ సేల్స్ విభాగం ఎక్కువగా ప్రభావితం కావచ్చు. ఉద్యోగుల తొలగింపు వార్తలపై కంపెనీ ఇంకా అధికారికంగా  స్పందించలేదు.

గత రెండేళ్లలో బైజూస్ కనీసం 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ మూలధనం క్షీణించడం, పెట్టుబడిదారులు అలాగే  వాటాదారులతో చట్టపరమైన గొడవలతో పోరాడుతోంది. ప్రస్తుతం, బైజూ ఇండియన్ యూనిట్‌లో దాదాపు 14,000 మంది ఉద్యోగులు పేరోల్‌లో ఉన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios