వాట్సాప్‌లో ఈ మెసేజ్ కనిపిస్తుందా.. అయితే వెంటనే ఈ ఫీచర్‌ని ఆన్ చేయండి..

ఫోన్స్, డెస్క్‌టాప్‌ల నుండి వాట్సాప్ అకౌంట్స్ ఆటోమేటిక్ గా లాగ్ అవుట్ చేయబడుతున్నాయి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, లాగ్ అవుట్ అయిన తర్వాత, మళ్లీ లాగిన్ చేయడానికి 6 అంకెల OTP కూడా అవసరం లేదు, అయితే ఈ OTP అనేది  తప్పనిసరి. 
 

Big bug in WhatsApp, accounts are getting logged out automatically, turn on this feature immediately-sak

మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌లో పెద్ద బగ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాట్సాప్‌లో పెద్ద బగ్ ఉంది, దీని కారణంగా వ్యక్తుల ఖాతాలు ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతున్నాయి. దీనిపై పలువురు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు.

మేము కూడా ఈ సమస్యను అనుభవించాము. ఫోన్స్ అండ్  డెస్క్‌టాప్‌ల నుండి వాట్సాప్ అకౌంట్  ఆటోమేటిక్ గా లాగ్ అవుట్ చేయబడుతున్నాయి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, లాగ్ అవుట్ అయిన తర్వాత మళ్లీ లాగిన్ చేయడానికి 6 అంకెల OTP కూడా అవసరం లేకుండా   అవుతుంది.  అయితే ఈ  OTP  అనేది తప్పనిసరి. 

వాట్సాప్ అకౌంట్  కోడ్ లేకుండా లాగిన్ చేయడం సాధ్యం కాదు. ఇలా జరిగితే దీని వల్ల వినియోగదారుల అకౌంట్  భద్రతకు ముప్పు. లాగ్ అవుట్ అయిన తర్వాత, వినియోగదారుల సెక్యూరిటీ  కోడ్‌లు కూడా మారుతున్నాయి. ఈ సమస్యను ఆండ్రాయిడ్, iOS అండ్ వెబ్  వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. 

WhatsApp ఈ బగ్‌కు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు, కానీ సపోర్ట్ పేజీలో అందించిన సమాచారం ప్రకారం, WhatsApp సెక్యూరిటీ సమస్య ఉన్నట్లు భావిస్తే, ఆటోమేటిక్ గా అకౌంట్  లాగ్ అవుట్ చేయగలదు, అయితే ఈ పని WhatsApp చేయలేదు. అది కూడా  లింక్డ్ ద్వారా పనిచేస్తుంది, ప్రైమరీ  డివైజ్  కాదు. ఇలాంటి పరిస్థితిలో దీనిని ప్రస్తుతం బగ్‌గా పరిగణించబడుతుంది. అయితే ఇదంతా వాట్సాప్ చేస్తున్న బీటా టెస్టింగ్‌లో భాగమని కూడా చెబుతున్నారు. నిజానికి వాట్సాప్‌లో టెలిగ్రామ్ లాగా లాగ్ అవుట్ ఫీచర్ రాబోతోంది.

Big bug in WhatsApp, accounts are getting logged out automatically, turn on this feature immediately-sak

మీ ఆకౌంట్  సురక్షితంగా ఉంచుకోవడానికి ఇలా చేయండి
ప్రస్తుతం, ఆటోమేటిక్ లాగ్అవుట్ సమస్యను పరిష్కరించడానికి మార్గం లేదు, కానీ మీరు మీ అకౌంట్ సెక్యూరిటీ  కన్ఫర్మేషన్  కోసం ఈ  పని చేయవచ్చు. మీరు మీ WhatsAppలో టు ఫాక్టర్ అతేంటికేషన్ ఆన్ చేయాలి. దీని ప్రయోజనం ఏమిటంటే కోడ్ లేకుండా మీ అకౌంట్  లాగిన్ చేయబడదు.

వాట్సాప్‌లో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఎలా ఆన్ చేయాలి
*మొదట WhatsApp సెట్టింగ్‌లకు వెళ్లండి.

*ఇప్పుడు అకౌంట్ అప్షన్ పై క్లిక్ చేయండి.

*ఇప్పుడు మీరు టు ఫాక్టర్ అతేంటికేషన్  అప్షన్  చూస్తారు.

*దానిపై క్లిక్ చేసి ఆన్ చేయండి.

*ఇక్కడ మిమ్మల్ని 6 అంకెల పిన్ అడుగుతుంది.

*లాగిన్ కోసం ఈ పిన్ మళ్లీ మళ్లీ ఉపయోగించబడుతుంది, కాబట్టి ఈ పిన్ గుర్తుంచుకోండి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios