Asianet News TeluguAsianet News Telugu

20వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే: గొప్ప కెమెరా, బెస్ట్ ప్రాసెసర్‌తో ఫుల్ లిస్ట్ చూడండి..

ఇప్పుడు కూడా గొప్ప స్పెసిఫికేషన్‌లతో ఎన్నో ఫోన్‌లు విడుదల అవుతున్నాయి. మీరు కూడా రూ.20 వేల లోపు 5G ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మంచి స్పెసిఫికేషన్‌లతో 5G ఫోన్‌ల గురించి మీకోసం..
 

Best Smartphones Under 20000: Phones with great cameras and great processors, see the full list
Author
Hyderabad, First Published Aug 23, 2022, 1:21 PM IST

ఇండియాలో 5జీ కనెక్టివిటీకి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. త్వరలో 5G సర్వీస్ ప్రారంభం కానుంది. ఈ సర్వీస్ ప్రయోజనాన్ని పొందడానికి మీకు 5G కనెక్టివిటీతో కూడిన స్మార్ట్‌ఫోన్ అవసరం. గత రెండేళ్లలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 5G కనెక్టివిటీతో ఎన్నో ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు కూడా గొప్ప స్పెసిఫికేషన్‌లతో ఎన్నో ఫోన్‌లు విడుదల అవుతున్నాయి. మీరు కూడా రూ.20 వేల లోపు 5G ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మంచి స్పెసిఫికేషన్‌లతో 5G ఫోన్‌ల గురించి మీకోసం..

వన్ ప్లస్ నార్డ్ సి‌ఈ 2 లైట్ 5జి
వన్ ప్లస్ నుండి వస్తున్న వన్ ప్లస్ నార్డ్ సి‌ఈ 2 లైట్ 5జి కంపెనీ అతి తక్కువ ధర కలిగిన ఫోన్. మీరు తక్కువ ధరలో వన్ ప్లస్ ఫోన్‌ని కోనాలనుకుంటే ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్. వన్ ప్లస్ నార్డ్ సి‌ఈ 2 లైట్ 5జి 6.59-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, గ్రాఫిక్స్ కోసం Adreno 619 GPUతో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌, 128జి‌బి స్టోరేజ్‌తో పాటు 8 జి‌బి వరకు LPDDR4X RAM, మూడు బ్యాక్ కెమెరాలు దీనిలో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్, రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ డెప్త్ అండ్ మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. అలాగే ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఇంకా 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 6 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ రూ. 19,999కి అండ్ 8 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్‌తో  ఫోన్‌ను రూ.21,999కి కొనుగోలు చేయవచ్చు. 

రియల్ మీ 9 5జి స్పీడ్ ఎడిషన్    
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్ మీ UI 2.0 రియల్ మీ 9 5జి SEలో ఉంది. 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి + డిస్ ప్లే, స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్‌, 8జి‌బి వరకు LPDDR4X ర్యామ్ తో 5 జి‌బి వరకు విస్తరించదగిన ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా మూడు బ్యాక్ కెమెరాలు, ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్, రెండవ లెన్స్ మోనోక్రోమ్, మూడవ మాక్రో లెన్స్, సెల్ఫీ కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా, 5000mAh బ్యాటరీ ఇంకా 18W క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 6 జీబీ ర్యామ్‌తో కూడిన 128 జీబీ స్టోరేజ్ ధర రూ.19,999, 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ.22,999. 

మోటో జి62 5జి 
మోటో జి62 5జి  కూడా 20 వేల లోపు బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్‌లో 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 8జి‌బి ర్యామ్ తో 128జి‌బి వరకు స్టోరేజ్, ట్రిపుల్ కెమెరా సెటప్, ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అలాగే, ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఇంకా 20W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. 

రెడ్‌మి నోట్ 11 ప్రో ప్లస్
ఈ ఫోన్ లాంచ్ ధర రూ.24,999, ఇప్పుడు ఈ ఫోన్‌ను రూ.19,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 8జి‌బి వరకు ర్యామ్, 256జి‌బి వరకు స్టోరేజ్ ఉంది. ఫోన్‌లో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, దీనిలో 108 మెగాపిక్సెల్‌ల ప్రైమరీ సెన్సార్, రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్‌ అల్ట్రా వైడ్ యాంగిల్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్. అలాగే ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5000mAh బ్యాటరీ ఇంకా 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఫోన్‌లో అందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios